వీటిని తీసుకుంటే డెంగ్యూ దగ్గరకి కూడా రాదు..

Purushottham Vinay
వానా కాలం అంటే చాలు రోగాలనేవి విలయతాండవం చేస్తాయి. ముఖ్యంగా ఈ కాలంలో డెంగ్యూ వచ్చే ప్రమాదం చాలా వుంది. కాబట్టి ఖచ్చితంగా డెంగ్యూ నుంచి మిమ్మల్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఇవి తీసుకోవడం వల్ల డెంగ్యూ జబ్బు మీ దారిదాపుల్లోకే రాదు. మరి అవేంటో తెలుసుకోండి. డెంగ్యూ నుంచి మిమ్మల్ని మీరే కాపాడుకోండి.ఇక మాములుగా పసుపును కూరగాయలు లేదా పప్పులలో ఉపయోగిస్తాం. అలా కాకుండా.. పసుపు పాలను తీసుకోవడం ద్వారా కూడా మంచి ఫలితం అనేది కనిపిస్తుంది. ఇక ఇందులో ఉండే యాంటీబయోటిక్ ఎలిమెంట్స్ అనేవి రోగనిరోధక శక్తిని చాలా బలోపేతం చేస్తాయి.అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి.తులసి ఇంకా తేనెను తీసుకోవడం వలన డెంగ్యూని కూడా తొందరగా నివారించవచ్చు. తులసి ఆకులను నీటిలో బాగా మరిగించి అందులో తేనెను కలిపి తాగవచ్చు.ఇక అలాగే కషాయంలో లేదా టీలో కూడా తులసిని ఉపయోగించవచ్చు.


ఇక ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వ్యాధులను నివారించడంలో ఎంతగానో సహాయపడతాయి.డెంగ్యూ చికిత్సలో బొప్పాయి ఆకులనేవి మంచి నివారణగా పనిచేస్తాయి. బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకొని రోజుకు 2 నుంచి 3 స్పూన్ల చొప్పున తీసుకుంటే డెంగ్యూని తొందరగా నివారించవచ్చు. ఇది కేవలం ఎర్ర రక్త కణాలను మాత్రమే పెంచడం కాకుండా, జీర్ణ శక్తిని మెరుగుపరిచే పాపైన్ అనే ప్రోటీన్ అధికంగా ఉండే ఎంజైమ్‌ను కూడా కలిగి ఉంటుంది.ఇక డెంగ్యూ జ్వరం వలన శరీరంలో రక్తం లేకపోవడం ఇంకా బలహీనతను అధిగమించడానికి, దానిమ్మ కాయని తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ఇక ఇందులో విటమిన్ E, C, A, ఫోలిక్ యాసిడ్, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటులో కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.అలాగే ఇది రక్తహీనతను తగ్గించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: