"రాధిక" రకం బెండకాయ గురించి మీకు తెలుసా.?
వరంగల్ చెందిన ఓరైతు ఎరుపు రంగులో ఉన్న బెండకాయలను పండిస్తున్నారు. అది కూడా కృత్రిమ పద్దతిలో కాకుండా సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్నాడు.అయితే ఈ ఎరుపు రంగు బెండకాయలు చాలా అరుదైన రకమని ఆయన చెబుతున్నారు.వివరాల్లోకి వెళితే వరంగల్ అర్బన్ జిల్లాలోని పెంబర్తికి చెందిన ప్రభాకర్ రెడ్డి సేంద్రియ వ్యవసాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో తన పొలంలో అరుదైన ఎరుపు రంగులో ఉండే బెండను సాగుచేశారు.ఈ వంగడాన్ని 'రాధిక' అనే పేరుతో పిలుస్తారని ఆయన చెబుతున్నాడు.
ఈ రాధిక బెండకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉందని చెబుతున్నాడు.ఈ బెండపై వరంగల్ ఉద్యానశాఖ అధికారి సుద్దాల శంకర్ మాట్లాడుతూ ఈ అరుదైన రాధిక వంగడం తెలంగాణ ప్రాంతంలో పండుతుంది. దీన్ని ఎక్కువగా చలి ప్రదేశాల్లో పండిస్తూ ఉంటారు. ఈ బెండతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ముఖ్యంగా రక్తహీనతను తగ్గించడానికి ఈ బెండ బాగా ఉపయోగపడుతుంది అని ఆయన తెలిపారు. అలాగే ఈ అరుదైన బెండలో ఎన్నో రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయి.' అని వివరించారు.మరి మీరు కూడా ఒకసారి రాధికను టేస్ట్ చేసి చూడండి. రక్త హీనతతో బాధ పడేవారికి ఈ బెండకాయ బాగా ఉపయోగపడుతుంది. !