ఇక మనం కూరగాయలు కొంటున్నామంటే ఖచ్చితంగా అందులో బెండ కాయలు ఉండాల్సిందే. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా బెండకాయలను ఆహారంగా తీసుకోని తినడానికి ఎంతగానో ఇష్టపడతారు.ఇక పిల్లలు బెండకాయలు తినేందుకు చాలా మారం చేసినా కాని జ్ఞాపక శక్తి పెరుగుతుందని అలాగే లెక్కలు బాగా వస్తాయని చెప్పి మరీ పెద్దవాళ్లు బలవంతంగా పిల్లలకి తినిపిస్తుంటారనే సంగతి తెలిసిందే. ఇక బెండకాయను ఇంగ్లీషులో ‘ఓక్రా’ లేదా లేడీ ఫింగర్ అని అంటారని తెలిసిందే. ఇక ఈ ఆరోగ్యకరమైన బెండకాయలను వయస్సు ఇంకా వ్యాధులతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ తినొచ్చని ఆహార నిపుణులు వెల్లడిస్తున్నారు. మరి,బెండకాయని డయాబెటిస్ (మధుమేహం) బాధితులు తినొచ్చా? ఒక వేళ తింటే ఏ విధంగా తినాలి ? బెండకాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటీ? ఇలాంటి వివరాలను ఇప్పుడు తెలుసుకోండి.ఇక బెండకాయల్లో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. బెండకాయ విటమిన్లు, మినరల్స్, ఫైబర్‌తోపాటు తక్కువ క్యాలరీలు కలిగిన కూరగాయ ఇది.
షుగర్ బాధితుల్లో ఏర్పడే జీవక్రియ సమస్యలు అంత సులభంగా నయం కావు. అయితే, మంచి జీవనశైలి అలవాట్లతో బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రణలో పెట్టుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని పూర్తిగా అదుపులో ఉంచవచ్చు. మంచి సమతుల్య ఆహారం, వ్యాయామం,అలాగే తగిన విశ్రాంతి ద్వారా షుగర్ వ్యాధిని బాగా నియంత్రించవచ్చు. మన శరీరంలో బ్లడ్ షుగర్స్ అనేవి మంచిగా అదుపులో ఉంటేనే మన శరీర అవయవాలు కూడా దెబ్బతినకుండా సక్రమంగా పనిచేస్తాయి. అందుకే బెండకాయ చాలా చక్కగా పనిచేస్తుంది.బెండకాయ షుగర్ స్థాయిలను తగ్గించడంలో చక్కగా పనిచేస్తోందని తేలింది. ఇక బెండకాయలో పూర్తిగా కరగని అలాగే కరిగే ఫైబర్ ఉంటుంది. బ్లడ్ షుగర్స్‌ను బెండకాయ అదుపులో ఉంచుతుంది. ఆహారం ద్వారా శరీరానికి అందే కార్బోహైడ్రైట్లను గ్రహించే ప్రక్రియను బెండకాయ నెమ్మదిగా జరిగేలా చూస్తుంది. దాని ఫలితంగా జీర్ణక్రియ అనేది నెమ్మదిగా సాగుతుంది. ఫలితంగా శరీరంలో ఒకేసారి బ్లడ్ షుగర్ స్థాయిలు కూడా పెరగవు.