ఈ ఫిష్ బిస్కెట్లు గురించి మీకు తెలుసా...?

Suma Kallamadi
కరోనా వైరస్ వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది అయితే కరోనా వైరస్ ప్రభావంతో ప్రాణాలు సైతం కోల్పోయారు. కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడడం కోసం ప్రభుత్వాలు ఎన్నో రకాల చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.అలాగే కరోనాను కట్టడి చేయడానికి వాక్సిన్ కూడా అందుబాటులోకి తీసుకునివచ్చారు.వాక్సిన్ తో పాటు కరోనా ముప్పు నుంచి బయట పడాలంటే మనిషికి రోగ నిరోధక శక్తి అనేది చాలా అవసరం. ఎవరికయితే ఇమ్మ్యూనిటి శక్తి అధికంగా ఉంటుందో వాళ్ళు త్వరగా కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ఇమ్మ్యూనిటిని పెంచుకునేందుకు ప్రజలు బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. మనకి వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారంలో చేపలు ముఖ్య పాత్ర పోషిస్తాయి అని చెప్పాలి.చేపలు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా  చేపలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఎందుకంటే చేపలలో ఓమెగా ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా అధిక స్థాయిలో ఉంటుంది.


ఇవన్నీ  దృష్టిలో పెట్టుకుని  పంజాబ్‌లోని లూధియానా ఫిషరీస్‌ కళాశాల చేపలపై ఒక ప్రయోగం చేసి ఫిష్ బిస్కెట్లను తయారు చేస్తుంది.ఈ బిస్కెట్లు తింటే వ్యాధినిరోధక శక్తి అనేది అధికం అవ్వడంతో పాటు కోవిడ్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ అవుతాయని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వలన దేశం మొత్తం చాలా ఇబ్బందులు పడుతున్న కారణంగా వైరస్ ను తగ్గించే క్రమంలో ఈ బిస్కెట్లను తయారు చేస్తున్నట్లు ఆ కళాశాలకు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు వెల్లడించారు.  ఈ ఫిష్ బిస్కెట్ లలో ప్రొటీన్స్‌ ఎక్కువగా ఉంటాయట.


అలాగే అక్కడ  యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ బిస్కెట్ లలో  ప్రొటీన్స్‌, ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటాయట.మీకు ఒక డౌట్ రావచ్చు.. చేపలు నీసు వాసన వస్తాయి కదా.. మరి ఈ బిస్కెట్ లు కూడా అలాగే వాసన వస్తాయేమో అని అనుకోవచ్చు. కానీ చేపలతో తయారు చేసే ఈ బిస్కెట్లు చేపల వాసన అస్సలు ఉండవు అంట. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఈ రుచికమైన బిస్కెట్లను ఇష్టంగా తినవచ్చు అంటున్నారు శాస్ర్రవేత్తలు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: