పరగడుపున వీటిని తింటే రోజంతా ఉత్సాహం..

Divya

ముఖ్యంగా మనం ఉదయం తీసుకునే ఆహారం పై ప్రతి ఒక్కరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మనం తినే ఆహారం వల్లే రోజంతా ఆధారపడి ఉంటుంది. మన బాడీ చాలా యాక్టివ్ గా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. లేకపోతే పలు ఆరోగ్య  సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలలో నీరసం,అలసట,త్వరగా ఫ్లూ భారిన పడటం వంటివి. కొంతమంది ఉదయం లేవగానే ఎంతో నీరసంతో కనిపిస్తుంటారు. అలాకాకుండా వారు ఎంతో ఉత్సాహంగా ఉండాలంటే , ఇప్పుడు చెప్పే కొన్ని ఆహార పదార్థాలను పరగడుపున తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉండవచ్చు.

ముఖ్యంగా మనం ఆహారం తీసుకునేటప్పుడు ఉదయం పూట ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అలా ప్రోటీన్లు ఉండే వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం.

1).వేరుశెనగ గింజలు:
వేరుశెనగ గింజలను రాత్రి బాగా నానబెట్టి, ఉదయం లేవగానే , అల్పాహారంగా తీసుకోవడం వల్ల మనకు పొటాషియం, ఐరన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. తద్వారా ఉదయం పూట అలసట లేకుండా ఉండవచ్చు.
2). తేనె:
కొద్దిగా గోరువెచ్చని నీటిలోకి తేనె వేసుకొని ఉదయం పూట తాగడం వల్ల మనకు విటమిన్స్ ఎక్కువగా లభిస్తాయి.
3). బాదం:
నానబెట్టిన బాదంని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే, అందులో వుండే  విటమిన్స్, ప్రోటీన్స్ వల్ల మన ఆరోగ్యానికి మంచిది. అంతే కాకుండా వీటిని ప్రతి రోజు తినడం కూడా మంచిదే.
4). ఉడికించిన కోడిగుడ్లు:
ఉడికించిన గుడ్డును తినడం వల్ల ఎముకలు ఎంతో బలంగా తయారవుతాయి. అంతే కాకుండా కంటి సమస్యలు  కూడా దూరం అవుతాయి. ఇందులో డి విటమిన్ కూడా పుష్కలంగా లభిస్తుంది.
5). మొలకెత్తిన గింజలు:
మొలకెత్తిన గింజలు ఏవైనా సరే తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. మొలకలు ఎక్కువ పొడవుగా వచ్చినప్పుడే గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ గింజలు తినేటప్పుడు ఒకే రకమైన గింజలు కాకుండా రెండు మూడు రకాల గింజలను తినడం మంచిది.

చూశారు కదా ! ప్రతి రోజు వీటిని మీ అల్పాహారంలో భాగంగా చేసుకొని, రోజంతా ఉత్సాహంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: