తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతుంది. అయితే తెలంగాణతో పోలిస్తే ఏపీలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కాగా ఏపీలో కరోనా పాజిటివిటీ రేటు పై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఎప్రిల్ ఫస్ట్ వీక్ నుండి రాష్ట్రంలో పాజిటివిటీ పెరుగుతోందని వెల్లడించింది. శనివారం ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాష్ట్రాల్లో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వీడియోకాన్పరెన్స్ ద్వారా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రేదేశ్ లోని చిత్తూరు, గుంటూరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాకట్నంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయనని గుర్తించారు. ఈ సందర్భంగా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ సుజీత్ కె.సింగ్ వ్యాధి సంక్రమణ తీరుపై ప్రజెంటేషన్ ఇచ్చారు. కరోనా బారినపడ్డ గ్రామస్థులు పట్టణాలకు వస్తున్న నేపథ్యంలో హాస్పిటల్స్ లో మౌళిక సదుపాయాలు కలిపించాలన్నారు.
ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న రాష్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని కేంద్ర వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న ఎనిమిది రాష్ట్రాల్లో తమిళనాడు మొదటిస్థానంలో ఉండగా ఏపీ రెండో స్థానంలో ఉందని చెప్పారు. ఆ తర్వాత వరుసగా పశ్చిమబెంగాల్, ఒడిశా, పంజాబ్, అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరిలు ఉన్నట్టు పేర్కొన్నారు. అంతే కాకుండా గడిచిన రెండు వారాల నుండి కేసులు పెరుగుతున్న 15 జిల్లాల్లో తూర్పుగోదావరి ఆరోస్థానంలో ఉండగా విశాఖ 10, కడప 12 స్థానాల్లో ఉన్నాయి. ఇక గతవారం మే 8-14 మధ్య 25.3 శాతంతో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. కరోనా యాక్టివ్ కేసుల పరంగా చూసినట్లయితే మొత్తం 2,03,787 యాక్టివ్ కేసులతో ఏపీ దేశంలో 5వ స్థానం ఉంది. అంతే కాకుండా దేశం మొత్తంలో కేసుల పాజిటివిటి 516 జిల్లాల్లో 10శాతం ఉండగా అందులో ఆంధ్రప్రదేశ్ లోని అన్నిజిల్లాలు ఉండటం ఆందోళనకరం.