పసుపుతో కరోనాకి చెక్.. ఎలాగంటే..

Purushottham Vinay
ఇప్పుడు ప్రపంచంలో వున్న ప్రతి ఒక్కరిని బాగా వెంటాడుతున్న భయం.. కరోనా మహమ్మారి.ఎప్పుడు ఎలా వస్తుందో. ఏ విధంగా ప్రాణాలని బలి తీసుకుంటుందో చెప్పలేము.అయితే, మీరు ఈ మహమ్మారి గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే పలు జాగ్రత్తలు పాటిస్తూ ఉండటం ఇంకా మందులు వాడటం, శరీరానికి తగిన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకోవచ్చు. ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మూడు నుంచి నాలుగు వారాల్లోనే కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొంది సురక్షితంగా ఉండొచ్చు. మీకు కరోనా నెగటివ్ వచ్చినా, పాజిటివ్ వచ్చినా.. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. తప్పకుండా ముక్కు, నోరుకు మాస్కు పెట్టుకోండి. కరోనా వైరస్ వున్నా లేకపోయినా కాని మాస్కు పెట్టుకోవడం అన్ని విధాలా చాలా మంచిది. అలాగే బయట భౌతిక దూరం పాటించడం ఇంకా చాలా మంచిది. ఎందుకంటే.. ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. పైగా ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది.

ఇక కరోనాని మనం చాలా సింపుల్ గా మన వంటింట్లో దొరికే పదార్ధాలతో ఈజీగా అరికట్టవచ్చు. ఇక మన ప్రాచీన కాలం నుంచి ఇప్పటివరకు కూడా పసుపు మంచి ఔషధ గుణంగా పరిగణించబడుతుంది. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. ఇది అనేక రకాల బాక్టీరియాలని అలాగే వైరస్ లని నాశనం చెయ్యడంలో సహాయపడుతుంది. ఇక పసుపుతో ఈ పానీయం తయారు చేసుకొని రోజు పడుకునే ముందు తాగితే కరోనాకి పూర్తిగా చెక్ పెట్టొచ్చు.

ఒక లీటర్ నీళ్లు తీసుకుని అందులో కాస్త పసుపు ముక్క లేదా ఒక స్పూన్ పసుపు వేయండి. ఒక టేబుల్ స్పూన్ నల్ల మిరియాల పొడి, 10-15 తులసి ఆకులు, 6-8 లవంగాలు, ఒక అంగుళం అల్లం ముక్క, దాల్చిన చెక్క ఒక ముక్క.. ఒక్కొక్కటిగా వేసి స్టవ్ మీద బాగా మరిగించండి. ఆ తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి వడపోయండి. ఆ ద్రావణంలో కొద్దిగా నిమ్మకాయ పిండండి. ఈ పానియాన్ని గోరు వెచ్చగా తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి కరోనాని జయించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: