బరువు తగ్గాలనుకునేవారు.. ఈ డైట్ ను ఫాలో అవ్వండి..!

Divya

ప్రస్తుత కాలంలో చాలా మంది ఎన్నో రకాలుగా అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఇందుకోసం ఎన్నో రకాల ఎక్సర్సైజ్లు, వ్యాయామాలు చేస్తూ డాక్టర్లు చుట్టూ తిరుగుతున్నారు. అంతేకాకుండా చాలా మంది ఎక్ససైజ్ సెంటర్లను, జిమ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. అంతేకాకుండా ఫుడ్ డైట్ మెనూ ఏర్పాటు చేసుకుని అందుకు తగ్గట్టుగా ఫాలో అవుతున్నారు. ఎలాంటి పరిస్థితులలోనైనా సరే బరువు తగ్గాలని అనుకున్నప్పుడు అందుకు తగ్గట్టు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మేము చెప్పబోయే ఫుడ్ డైట్ మెనూ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా,  ఇంట్లో ఉండే అధికబరువును అధిగమించవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే ఆ మెనూ ఏంటో ఇప్పుడు ఇక్కడ చదువు తెలుసుకున్నాం..

ముందురోజు రాత్రి ఒక లీటర్ నీటిలో కీరా ముక్కలు, పది నుంచి పదిహేను పుదీనా ఆకులు, నిమ్మరసం ,కొద్దిగా అల్లం వేసి పెట్టుకోవాలి. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఈ నీటిని కొద్ది కొద్దిగా సేవిస్తూ ఉండాలి. ప్రతి రోజూ ఇలా చేయడం వల్ల శరీరంలోని మలినాలను పోగొట్టడమే కాకుండా కొవ్వును కూడా తగ్గిస్తుంది.

ఉదయం అల్పాహారం కూడా మన అధిక బరువు పైన ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే అల్పాహారం మంచి డైట్ తో కలిగి ఉన్నదై ఉండాలి. పోషక విలువలు కలిగిన పదార్థాలైన కొత్తిమీర ,పాలకూర ,నిమ్మరసం ,ఆపిల్ ముక్కలు తీసుకొని మిక్సీలో వేసి జ్యూస్ లా తయారు చేసుకోవాలి. ఈ జ్యూస్ లో పొటాషియం పాళ్లు అధికంగా ఉంటాయి .కాబట్టి తరచూ ఆకలి వేయదు.

భోజనానికి ముందు క్యారెట్ ముక్కలు, పుదీనా, కీర ,కొత్తిమీర ఒక గిన్నెలో వేసుకొని  తినవచ్చు.
భోజనం చేసేటప్పుడు ఒక పెద్ద బౌల్ లో  రకరకాల మొలకెత్తిన గింజలు వేసుకొని, అందులో కొద్దిగా ఆపిల్ ముక్కలు, కాస్త వెనిగర్ వేసి బాగా కలిపి తినాలి. దీంతోపాటు ఉడికించిన బంగాళ దుంపలు , నిమ్మరసం కొన్ని మిరియాలు, కాస్త వెనిగర్ వేసి తినాలి.
సాయంత్రం నానబెట్టిన నాలుగు బాదం గింజలు పొట్టు తీసి తినాలి. గుమ్మడి గింజలు తినాలి .ఇలా చేస్తే క్రమంగా బరువు తగ్గడాన్ని గమనించవచ్చు.

ఎవరైతే బరువు తగ్గాలని ఆలోచిస్తున్నారో..అలాంటి వారు ఈ మెనూ మీ రోజువారి డైట్ లో చేర్చుకొని, క్రమంగా అధిక బరువును అధిగమించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: