ఉల్లిపాయ తొక్కలను పడేస్తున్నారా..? అయితే దాని ఉపయోగాలు తెలిస్తే ఎవ్వరూ పడేయరు...
ఉల్లిపాయ తొక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఆ నీటిని నొప్పులున్నచోట రాయడం వల్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే చర్మ సమస్యలు ఉన్న వాళ్ళు ఆ నీటిని రాసుకోవడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి.
ఒక గిన్నె తీసుకొని నీళ్ళు పోసుకొని అందులో కి ఉల్లిపాయ తొక్కలను వేసి కిటికీల వద్ద, మంచాల కింద, గుమ్మాల వద్ద పెట్టడం వల్ల క్రిమికీటకాలు, దోమలు రాకుండా ఉంటాయి. ఉల్లిపాయల వాసన వల్ల అవి రాకుండా ఉంటాయి.
ఉల్లిపాయ తొక్కలను మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకొని తలంతా బాగా మర్ధన చేసి 25 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.
ఉల్లిపాయ తొక్కలతో సూప్ చేసుకొని తాగడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిపోతుంది. ఫలితంగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే గుండెజబ్బుల బారిన పడకుండా ఉంటారు.
ఉల్లి పాయ సూప్ తాగడం వల్ల ఇది యాంటీ ఫంగల్ ఏజెంట్ గా, యాంటీబయటిక్ గా పనిచేసి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఇన్ని లాభాలు ఉన్న ఉల్లిపాయ తొక్కలను పడేయకుండా వాటిని ఉపయోగించుకొని మంచి ఫలితాలను పొందండి.