మహిళలు వేసవికాలంలో ఆ జ్యూస్ ని తప్పనిసరిగా తాగాలట..!

Divya

సాధారణంగా వేసవికాలం వస్తోంది అంటే.. చాలామంది చల్లదనం కోసం తాజా పండ్ల రసాలను తాగాలని కోరుకుంటారు.. అలాంటప్పుడు వేసవి కాలంలో మండే సూర్యుడి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే అందుకు తగ్గట్టు చల్లదనాన్ని జోడించాల్సి ఉంటుంది. మన శరీరం లోపలి నుంచి చల్లదనాన్ని అందించాలంటే పుదీనా రసం, నిమ్మరసం, మజ్జిగ, చెరకు రసాలు తాగాల్సి ఉంటుంది. అందుకే వీటి ధర కూడా ఎక్కువ. ఈ వేసవి కాలంలో మహిళలు ఎక్కువగా ఢీ హైడ్రేషన్ కు గురి అవుతూ ఉంటారు. అలాంటి వారు ఎక్కువగా ఈ చెరకు రసం తాగాలి అని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఈ చెరుకు రసం తాగడం వల్ల మహిళలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో..? ఇప్పుడు తెలుసుకుందాం..

చెరుకు రసం సంతానోత్పత్తికి మంచిగా పనిచేసే ఒక  బూస్టర్ అని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కొత్తగా తల్లి అవుతున్న వాళ్ళలో పాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇక మగవారిలో శుక్రకణాల నాణ్యత కూడా మెరుగుపరచడానికి చెరుకురసం ఉపయోగపడుతుంది. నెలసరి సమయంలో మహిళలు పడే బాధలో ఒకటైన కడుపునొప్పి నుండి బయట పడాలి అంటే చెరకు రసం తాగడం ఉత్తమం. అయితే ఇందుకోసం నెలసరి వచ్చే వారం రోజుల ముందు నుంచే చెరకు రసం తాగాల్సి ఉంటుంది.

అంతేకాక శరీరంలో ముఖ్యంగా కడుపులో ఏర్పడే అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలసట తీర్చి శక్తినిస్తుంది. అలాగే మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ళను సైతం కరిగించే శక్తి ఈ చెరకు రసానికి ఉంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది.  ఎవరైతే పచ్చ కామెర్లతో బాధపడుతున్నారో అలాంటివారికి చెరుకు రసం మంచిగా పని చేస్తుంది.

ఇక మొటిమలు, మచ్చలు లేని ముఖం కావాలనుకునేవారు కంపల్సరిగా ఈ చెరకు రసాన్ని తాగాలి. ఇక శరీరంలోని వేడిని తగ్గించుకోవడానికి, జీర్ణ సంబంధమైన ఇబ్బందులను తొలగించుకోవడానికి చెరకు రసం ఎంతగానో ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: