మొలకెత్తిన వెల్లుల్లి పాయలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..?

Divya

వెల్లుల్లి రెబ్బలను ప్రతిరోజూ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మన అందరికీ తెలుసు. ఆయుర్వేదంలో కూడా ఈ వెల్లుల్లి రెబ్బలను ఉపయోగించేవారు. ఇటీవల కూడా ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బ ఎంతగానో ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక పరిశోధన ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే.. ఈ వెల్లుల్లిని నేరుగా తినడం కంటే వాటిని మొలకెత్తించి తినడం వల్ల రెట్టింపు స్థాయిలో మనకు పోషకాలు లభిస్తాయి అని అంటున్నారు.. అయితే ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలామందికి వెల్లుల్లిపాయ ఎలా మొలకెత్తించాలో తెలియకపోయి ఉండొచ్చు.. వాటిని ఎలా మొలకెత్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఒక కప్పు లేదా గ్లాసులో దానిపై భాగం వరకు శుభ్రమైన నీటిని నింపాలి. ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకొని దానికి మూడు వైపులా టూత్ పిక్ ను గుచ్చి, ఆ పిక్ లు మూడువైపులా గ్లాసు పై భాగాన ఉండాలి. మధ్యలో వెల్లుల్లి రెబ్బ వేర్లు నీళ్లకు తగిలేలాగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఐదు రోజులు ఆగితే వెల్లుల్లిపాయలు మొలకెత్తుతాయి. ఇక వెల్లుల్లి వుంచిన కప్పు లేదా గ్లాసు ని తీసుకెళ్లి, కిటికీల వంటి ప్రదేశాలలో, సూర్యరశ్మి తగిలే ప్రాంతంలో ఉంచాలి. దీంతో మొలకలు బాగా వస్తాయి.వీటిని నేరుగా అయినా తినవచ్చు లేదా ఆహారంలో అయినా వాడుకోవచ్చు..

మొలకెత్తిన వెల్లుల్లిపాయలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. మొలకెత్తిన వెల్లుల్లి లో మెటబోలెట్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. అంతేకాకుండా రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగి, చెడు కొలెస్ట్రాల్ పోయి  మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. తద్వారా రక్త సరఫరా బాగా జరిగి, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి..

ఇలా మొలకెత్తిన వెల్లుల్లిపాయల లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ ను కూడా దూరం చేయగల శక్తి ఈ మొలకెత్తిన  వెల్లుల్లికి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: