ద్రాక్ష పండు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా?
రాబోతున్న వేసవి కాలంలో వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో పండ్లను మనం ఆహారంగా తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడున్న కాలంలో ద్రాక్ష పండ్లు ఎక్కువగా తీసుకోవాలి అని చెబుతుంటారు. ఎందుకంటే ద్రాక్షపండ్లలో నీరు శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. అయితే మనలో చాలా మందికి ఒక సందేహం ఎప్పటినుంచో ఉంది. నల్ల ద్రాక్ష మంచిదా..? లేక పచ్చ ద్రాక్ష మంచిదా..? అని.. ఇలాంటి సందేహానికి సమాధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నల్ల ద్రాక్ష పండు, పచ్చ ద్రాక్ష పండు రెండూ ఆరోగ్యానికి మంచి అంటున్నారు వైద్య నిపుణులు. మరీ ఎక్కువగా నల్ల ద్రాక్ష పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను విస్తృతంగా అధ్యయనం చేశారు. వీటిలో ఉండే రసాయనాల కారణంగా జుట్టు మరియు చర్మం అందంగా తయారవుతాయి. అంతేకాకుండా క్యాన్సర్ వంటి కణాల నుంచి కాపాడుతాయి. కొన్ని రకాల ఆకుపచ్చ లేదా ఎర్రని ద్రాక్ష పండ్ల లో కంటే నల్ల ద్రాక్ష పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.
ఒక కప్పు ద్రాక్ష పండు లో 100 కేలరీలు మాత్రమే మనకు లభిస్తాయి. నల్ల ద్రాక్ష అయితే ఆరోగ్యానికి మంచిది కానీ మితిమీరి తీసుకుంటే సమస్యలు తలెత్తుతాయి అంటున్నారు వైద్యులు. మితిమీరిన ద్రాక్ష పండు వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. కార్బోహైడ్రేట్లు ఓవర్లోడ్ అవ్వడం వల్ల మన శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. ఫలితంగా డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ.
అజీర్తి కి దారి తీస్తుంది. ఎక్కువ మోతాదులో ద్రాక్ష పండు తినడం వల్ల అజీర్తితో పాటు అతిసార వ్యాధికి కూడా కారణమవుతుంది. ఫలితంగా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. మూత్రపిండాల పనితీరు కూడా దెబ్బతింటుంది. అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్, వాంతులు, విరేచనాలు, వికారంగా అనిపించడం లాంటి సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాకుండా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక, ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది.