ఎలాంటి జబ్బులకు..?ఎలాంటి టీ..?మంచిదో తెలుసా..!

Divya

ప్రపంచంలో అత్యధికంగా చాలా మంది ఇష్టపడే పానీయం టీ. ఉదయం లేవగానే ఒక చక్కటి టీ గొంతులో పడాల్సిందే.. లేదంటే ఆ రోజు గడవదు. అయితే టీ లలో చాలా రకాలు ఉన్నాయి. అవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు అని చాలా మందికి తెలుసు. అంతే కాకుండా ఇటీవల బటర్ టీ కూడా వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరీ ముఖ్యంగా కొన్ని ఔషధాలతో చేసిన టీ లతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చట.. అయితే ఏ టీ..?ఏ జబ్బు నయం చేస్తుందో..?ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

చామంతి టీ తో నిద్రలేమిని తగ్గించవచ్చు :
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో పని కారణంగా నిద్రపోవడాన్ని ఆలస్యం చేస్తున్నారు.  ఫలితంగా నిద్రలేమి సమస్యతో పలురకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు చామంతి టీ ని చేసుకొని తాగడం వల్ల శరీరం,మనసు రెండు తేలికపడి హాయిగా నిద్ర పడుతుంది.

గ్రీన్ టీ తో జీవక్రియలను వేగవంతం చేయవచ్చు :
బరువును తగ్గించే గ్రీన్ టీ తో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలుసు. అయితే ఇది మన శరీరంలోని మెటబాలిజంను పెంచే యాంటీ ఆక్సిడెంట్లను గ్రీన్ టీ పుష్కలంగా కలిగి ఉంటుంది. దీంతో  అధిక బరువును అదుపులో ఉంచేందుకు, జీవక్రియలను వేగవంతం చేయడానికి కూడా గ్రీన్ టీ సహాయపడుతుంది.

లావెండర్ టీతో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు :
లావెండర్ టీ చక్కటి సువాసనలను వెదజల్లుతూ, శరీరాన్ని,మనసును ఉత్తేజపరచడం తో పాటు మంచి నిద్రను ప్రసాదిస్తుంది.

పుదీనా టీ తో కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం : సాధారణంగా మహిళల్లో నెలసరి సమయంలో కడుపు నొప్పి,కడుపు ఉబ్బరం లాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి పుదీనాతో టీ చేసుకొని తాగడం వల్ల ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

లెమన్ టీ తో అధిక బరువును తగ్గించవచ్చు :
లెమన్ టీ  తాగడం వల్ల శరీరంలో ఏర్పడిన అధిక కొవ్వు తగ్గి క్రమంగా బరువు తగ్గడాన్ని గమనించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: