గాడిద పాలల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే, ఆశ్చర్యపోతారు...!
ఆవు పాలు, పాలతో పోలిస్తే గాడిద పాలల్లో ప్రొటీన్లు సమాన స్థాయిలో ఉంటాయి. అందుకే వీటిని తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
తల్లిపాలు, ఆవు పాలలో ఉండే ప్రొటీన్లు, ఖనిజాలు గాడిద పాల లో కూడా ఉన్నాయి. అందుకే చిన్న పిల్లలకు పట్టించడం మంచిది అంటున్నారు.
గాడిద పాలల్లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అందుకే ఇవి తాగడం వల్ల శరీరానికి కావాల్సిన కేలరీలు, విటమిన్ డి అధికంగా లభిస్తాయి.
గాడిద పాలను ఆర్థరైటిస్, దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండడానికి గాడిద పాలను ఉపయోగిస్తారు . అంతేకాకుండా కొన్ని గాయాలను నయం చేయడానికి కూడా గాడిద పాలను ఉపయోగిస్తారు.
గాడిద పాలల్లో యాంటీ మైక్రోబాయాల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి అంటువ్యాధులు, బ్యాక్టీరియా, ఇతర వైరస్ ల నుంచి దూరం చేసేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెంచుతాయి.
గాడిద పాలు తాగడం వల్ల నిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచే ప్రొటీన్లను మరియు సైటోకిన్ లను విడుదల చేయడానికి ప్రోత్సాహాన్ని అందిస్తాయి.
గాడిద పాలను ఆహార పదార్థాల కంటే సౌందర్య సాధనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. శరీరానికి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తాయి.
గాడిద పాలు సూర్య రశ్మి వల్ల కలిగే ఆక్సీకరణ నష్టము నుండి కణాలను రక్షించడానికి బాగా సహాయపడతాయి. వీటి వలన వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి.
గాడిద పాలతో స్నానం చేయడం వల్ల చర్మము మెత్తగా మృదువుగా ఉండడమే కాకుండా, ముసలితనమూ తొందరగా రాకుండా కాపాడతాయి.
గాడిద పాలను కాస్మొటిక్, సబ్బులు, ఫేస్ వాష్, షాంపూలు తయారీలోనూ వాడుతున్నారు.