అందంగా ఉండే రోజా పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయట. గులాబీ పూలల్లో ఉబ్బక, శతవత్రి, కర్ణిక అనే మూడు రకాలు ఉన్నాయట. అయితే వీటిలో శతవత్రి రకాన్ని ఎక్కువగా ఔషధాల్లో, ఆహారంలోను ఉపయోగిస్తుంటారు. వీటి రెక్కల్లో ఎక్కవగా విటమిన్ సీ, విటమిన్ ఏ లు అధికంగా ఉంటాయట. అంతే కాకుండా పీచు పదార్థం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫైటో కెమికల్స్ ఎక్కువగా ఉండే రోజా పూలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గులాబీ రెక్కలను పులియబెట్టి రోస్ వైన్ కూడా చేసుకుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు రోజా పూలతో కాషాయాన్ని చేసుకుని తాగితే కడుపులో మంట సమస్య తగ్గుతుందట. అంతే కాకుండా ఈ కషాయం తాగటం వల్ల శరీరం మెరిసేలా తయారవుతుంది. చర్మం పై ముడతలు, మొటిమలు తగ్గిపోతాయి. అంతే కాకుండా రోజా పువ్వులో ఉండే పదార్థాలు సన్న బడతానికి ఉపయోగపడతాయి. రోజా కాశయాన్ని తాగినా సన్నబడతారు. రోజా పువ్వు వాసన చూడటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. యవ్వన వయస్సులో వచ్చే మొటిమలను పోగొట్టే స్వభావం గులాబీలో ఉంటుందట. ఆంతే కాకుండా గులాబీ రేకులు తినడం వల్ల వీర్యాబివృద్ధి జరుగుతుందట. రోజుకు ఒక గుప్పెడు గులాబీ రేకులు తీసుకుంటే రక్తాన్ని శుద్ధి చేసి వీర్యాబివృద్ధిని పెంపొందిస్తుందట. రోజా రేకులతో కొంత బాత్ స్టాల్ కలిపి తాగితే ఒత్తిడి ని దూరం చేసుకుకోవచ్చట. గుల్ కంద్ అనే స్వీట్ తో మహిళల వచ్చే ఋతు స్రావం సమస్యలకు చెక్ పడుతుందట. ఒకవంతు గులాబీ రెక్కలు రెండు వంతుల పంచదార తీసుకుని జాడీలో ప్రతి రోజు వేస్తూ ఎండలో ఉంచాలి. ఇలా రెండు మూడు రోజులు చేస్తే గుల్ కంద తయారు అవుతుంది. దీన్ని రోజుకు ఒక అర చెంచా చొప్పున తింటే ఋతుస్రావం సమస్యలు తగ్గిపోతాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: