అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు తో కిడ్నీలో రాళ్లను సునాయాసంగా కలిగించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.!!
ఇంకా మనం మంచి నీటిని తక్కువగా తాగడం వల్ల కూడా మన శరీరంలో నీటి శాతం తగ్గి కాల్షియం, ఫాస్ఫేట్స్, ఆక్సిలేట్స్ వంటి రసాయనాలు పేరుకొని కిడ్నీలో రాళ్ళగా మారుతాయి. రాళ్ళు మూత్రపిండాల నుండి, మూత్రాశయంలోకి ప్రవేశించిన తర్వాత జ్వరం, చలి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్వంటివి తలెత్తుతాయి. క్రమంగా, చాలా నొప్పిగా ఉంటుంది. ముఖ్యంగా బొడ్డు, వీపు భాగంలో ఎక్కువగా ఈ నొప్పి ఉంటుంది. అయితే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది.డాక్టర ఇచ్చిన మందులను వాడుతూ కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నీళ్లు ఎక్కువగా తాగాలి. రోజుకి రెండు లీటర్ల మూత్రం బయటకు వచ్చేలా నీటిని తీసుకోవాలి.
ప్రతిరోజు అల్పాహారం ముందు ఒక గ్లాస్ నిమ్మరసం తాగడం వల్ల నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో ఉండే క్యాల్షియం స్టోన్ ను సమర్థవంతంగా కరిగించి బయటకు పంపిస్తుంది.
ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక స్పూన్ తులసి రసంలో ఒక స్పూన్ తేనే కలిపి త్రాగాలి.ఇలా క్రమం తప్పకుండ మూడు నెలల పాటు చేయాలి.
దానిమ్మ రసాన్ని క్రమంతప్పకుండా తీసుకోవడం ద్వారా, మూత్రపిండాల్లో రాళ్లను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
రెండు కప్పుల నీటిలో కొత్తిమిర వేసి ఒక కప్పు నీరు అయ్యేవరకు మరిగించాలి.ఈ నీటిని వడకట్టి ప్రతి రోజు త్రాగాలి.ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే కిడ్నీలో రాళ్లు క్రమంగా తగ్గిపోతాయి
ఉలవల్లో ముల్లంగి ఆకులను వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడకట్టి చారుగా తయారుచేసుకొని అన్నంలో కలుపుకొని తింటే కిడ్నీలో రాళ్లు తొందరగా కరిగిపోతాయి.
తాజా మామిడి ఆకులను నీడలో ఆరబెట్టి పొడిగా తయారుచేసుకోవాలి.ఈ పొడిలో నీటిని కలిపి ప్రతి రోజు ఉదయం తీసుకుంటూ ఉంటే కిడ్నీలో రాళ్ళ సమస్య తగ్గుతుంది.
గోదుమ గడ్డి రసం కూడా మూత్రపిండాల్లో రాళ్లను నిరోధించడంలో ప్రముఖంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రాళ్లు పెరగకుండా సహకరిస్తాయి
ఈ విధంగా చిన్న చిన్న చిట్కాలు పాటించి కిడ్నీలో రాళ్ల సమస్యను పరిష్కరించవచ్చు. నొప్పి మరీ తీవ్రంగా ఉంటే డాక్టర్ ని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం.