నిమ్మగడ్డి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో మీకు తెలుసా?

Divya

ప్రకృతిలో చాలా రకాల గడ్డి మొక్కలు కనిపిస్తుంటాయి.  అలా కనిపించే ప్రతి గడ్డి మొక్క ఏదో ఒక రకమైన ఔషధాన్ని కలిగి ఉంటుంది. ఈ గడ్డి మొక్కల ద్వారా లభించే అన్ని ఔషధాలు మనకు ఏదో విధంగా ఉపయోగపదుతుంటాయి. ఇలాంటి జాతికి చెందినది నిమ్మగడ్డి కూడా. నిమ్మగడ్డి ఆయుర్వేద శాస్త్రంలో మొదటి పాత్ర వహిస్తుందని చెప్పడంలో  ఎటువంటి ఆశ్చర్యం లేదు. నిమ్మగడ్డి తోపాటు సిట్రోనెల్ల గడ్డి రెండూ ఒకే గడ్డిజాతి మొక్కలు. వీటిలో ఉండే ఏరోమాటిక్ ఎసెన్షియల్ ఆయిల్ కారణంగా ఈ మొక్క సువాసనలు వెదజల్లే స్వభావం పుష్కలంగా ఉంటుంది.
ఎసెన్షియల్ ఆయిల్ కారణంగా వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతోపాటు చర్మ సౌందర్యానికి, హెయిర్ ఫ్రెష్ నర్స్ గా కూడా ఉపయోగపడతాయని వైద్య నిపుణులతో పాటు ఆయుర్వేద నిపుణులు కూడా సూచిస్తున్నారు. లెమన్ గ్రాస్ ద్వారా తయారు చేసుకునే టీ తాగడం వల్ల ఎన్నో రకాల వైరస్ నుంచి కూడా బయటపడవచ్చని వారు చెబుతున్నారు.అవి ఏంటి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
నిమ్మగడ్డితో టీ తయారుచేసుకొని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మగడ్డిని ముక్కలుగా చేసి,నీటిలో వేసి బాగా మరిగించాలి. నిమ్మగడ్డి మరుగుతున్నప్పుడు వీటి నుంచి సువాసనలు వెదజల్లే స్వభావం నిమ్మగడ్డి టీకి ఉంది. బాగా మరిగిన తరువాత వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే జలుబు, దగ్గు, జ్వరం, గొంతువాపు, గొంతునొప్పి తోపాటు తలనొప్పి వంటి సమస్యల నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా నిమ్మగడ్డిని ఎక్కువగా పర్ఫ్యూమ్స్, రూమ్ ఫ్రెష్ నర్స్, డియోడరెంట్, సోప్స్  అంటూ ఎన్నో రకాలుగా ఉపయోగిస్తుంటారు .
నిమ్మగడ్డిని ఎక్కువగా సువాసన వెదజల్లే మొక్కగా పరిగణిస్తారు.అంతేకాకుండా నిమ్మగడ్డి వల్ల చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.
నిమ్మగడ్డి నుండి వెదజల్లే సువాసనల కారణంగా మెదడు ప్రశాంతంగా ఉండడంతోపాటు రిలాక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ.అంతేకాకుండా ఇంట్లో ఉండే దోమలను తరిమి వేయడానికి కూడా నిమ్మగడ్డి రసం ఎంతగానో ఉపయోగపడుతుంది.ప్రస్తుత కాలంలో రైతులు 1-2 ఎకరాలలో ప్రత్యేకంగా పండిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: