ఫుడ్ పాయిజనింగ్ నుంచి రక్షించే ఐదు సూత్రాలు ఏంటో తెలుసా?

Divya

సాధారణంగా కొన్ని కొన్ని సందర్భాలలో ఆహారం విషతుల్యం ఉంటుంది. ఇలా అవడం వల్ల ఒక్కసారిగా కడుపులో మంట,నొప్పితో సతమతమవుతుంటారు. ఒక్కొక్కసారి ఈ నొప్పి చాలా తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంది. కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని మనందరికీ తెలిసిందే. తద్వారా వాంతులు కూడా అవ్వచ్చు. ఇలాంటి సమయాల్లో ఏం చేయాలో తెలియక  గాబరా పడుతూ డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటాము. అయితే కొన్ని పదార్థాలు తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ నుంచి బయటపడవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
అయితే ఆహార పదార్థాలు ఏంటి? వాటినుండి ఫుడ్ పాయిజనింగ్ అవ్వకుండా ఎలా కాపాడుకోవాలి? అనే అంశాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి కావలసిన తేమ అందుతుంది. కొబ్బరి నీళ్ళు శరీరం హైడ్రేటెడ్ గా ఉండడానికి ఎంతో సహకరిస్తాయి. కొబ్బరి నీళ్ళలో ఉండే కాల్షియం,పొటాషియం,మెగ్నీషియం, సోడియం వంటి మినరల్స్ ఉంటాయి.  ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి, శరీరం తేమను కోల్పోకుండా ఉంటుంది.  రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ నుంచి తప్పించుకోవచ్చు
పెరుగులో యాంటీ బయోటిక్ తత్వాలు ఎక్కువగా ఉన్నాయి. పెరుగుకు ఫుడ్ పాయిజనింగ్ నుండి బయటపడే తత్వం ఎక్కువ.పెరుగులో కొద్దిగా ఉప్పు, చక్కెర వేసుకొని రోజు తాగడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు  అందుతాయి.
వెల్లుల్లిని ముఖ్యంగా మన భారతీయ సంప్రదాయంలో ప్రతి వంటలోనూ వాడుతుంటారు. వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.వెల్లుల్లి తినడం వల్ల కడుపు నొప్పి, విరోచనాల నుండి బయటపడవచ్చు.ఫుడ్డు పాయిజనింగ్ సమస్యలు కూడా తొలగిపోతాయి.
మెంతులు రోజు తీసుకోవడం వల్ల ఛాతిలో మంట, కడుపులో నొప్పి,ఆకలి తగ్గడం వంటి సమస్యలు నుండి కాపాడుతుంది. సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఫుడ్ పాయిజనింగ్ అయిన సమయంలో మెంతులు తినడం వల్ల ఉపశమనం కలుగుతుంది.మంచినీళ్లు రోజు ఎక్కువగా తాగడం వల్ల ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు.

యాలకులు కూడా ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు శరీరంలో ఉండే విషపదార్థాలను బయటకు తొలగించే శక్తి యాలకులు ఉంది. కాబట్టి ప్రతి రోజు ఆహారం తిన్న తర్వాత ఒక రెండు యాలకలను నోట్లో వేసుకుంటే సరిపోతుంది. తద్వారా ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు కూడా తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: