కొవ్వుని తగ్గించే మందులతో క్యాన్సర్ ని కూడా జయించోచ్చట..!

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైన వ్యాధో అందరికి తెలిసిందే.. ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ ముప్పు ఎక్కువనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌తో మహిళలు ఎంతో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. కొలొరెక్టల్ (పెద్ద పేగు) క్యాన్సర్, లేదా మెలనోమా ముప్పు కూడా వీరికే ఎక్కువ. అయితే, తాజా అధ్యయనంలో ఓ ఆసక్తికర విషయం తెలిసింది. వివిధ క్యాన్సర్లతో బాధపడుతున్న మహిళలు.. కొవ్వు తగ్గేందుకు వాడే మందులతో మరణాన్ని జయిస్తున్నారట.
బ్రిటీష్ జర్నల్ ఆఫ్ క్లీనికల్ ఫార్మకాలజీలో ప్రచురితమైన ఈ విశ్లేషణ ప్రకారం.. ఆస్ట్రేలియాలో రొమ్ము, కొలోరెక్టల్, మెలనోమా క్యాన్సర్లకు చికిత్స పొదిన 6,430 మంది మహిళల ఆరోగ్య పరిస్థితులను 2003 నుంచి 2013 వరకు పరీక్షించారు. రోగ నిర్ధరణకు ముందుగానే వీరికి శరీరంలో కొవ్వును తగ్గించే మందులను అందించారు.
ఈ సందర్భంగా కొందరు మహిళల్లో ఘననీయమైన మార్పును గమనించారు. వీరిలో క్యాన్సర్ నిర్ధరణ జరిగిన తర్వాత కూడా చనిపోయే ముప్పు తక్కువగా కనిపించినట్లు గుర్తించారు. కొవ్వు తగ్గేందుకు ఉపయోగిస్తున్న మందుల్లో ఉండే యాంటీ ట్యూమర్ గుణాల వల్లే వారు.. క్యాన్సర్‌ మరణాల నుంచి బయటపడుతున్నట్లు భావిస్తున్నారు.
ఈ సందర్భంగా QIMR బెర్గాఫర్ మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూ్ట్‌కు చెందిన బీమెడ్, ఎంహెడ్, పీహెచ్‌డీ సహ రచయిత లియా-లి ఫెంగ్ మాట్లాడుతూ.. కొవ్వు తగ్గించే ముందులకు క్యాన్సర్ కణాలతో పోరాడే సామర్థ్యం ఉన్నట్లు ధృవీకరించబడితే.. భవిష్యత్తులో ఆ ఔషదాలు రోగులకు ఎంతో ఉపయుక్తంగా మారతాయని తెలిపారు. ఇలాంటి మరెన్నో ఆరోగ్యానికి సంబంధించిన ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: