పక్షవాతం రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఇవే .. కచ్చితంగా పాటించండి..

Purushottham Vinay
పక్షవాతం చాలా భయంకరమైన వ్యాధి. ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేము. చాలా మంది ఈ సమస్యతో బాధ పడుతూ ఉంటారు. ముఖ్యంగా వయసు మళ్ళిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇక పక్షవాతం అంటే ఏమిటి.. అది రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో కచ్చితంగా చదవండి. తప్పకుండా పాటించండి. ఎందుకంటే పక్షవాతం ఒక్కసారి వచ్చిందంటే చనిపోయేవరకు పోదు. దీనికి ఎలాంటి మందు లేదు. కాబట్టి కచ్చితంగా ముందు జాగ్రత్తలు పాటించండి. సంపూర్ణ ఆరోగ్యముగా ఉండండి.

ఇక పక్షవాతం అంటే ఏంటో చూద్దాం.. మనిషిలోని ముఖ్యమైన అవయవాల్లో మెదడు కూడా ఒకటి. శరీరం మొత్తాన్ని నడిపేది ఈ అవయవమే. మెదడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు శరీరం అదుపుతప్పకుండా పనిచేస్తుంది. అలాంటి మెదడులో చిన్న సమస్య తలెత్తినా ‘బ్రెయిన్ స్ట్రోక్’ ఏర్పడుతుంది. అదే ‘పక్షవాతం’. దీని వల్ల శరీరంలోని అవయవాలు అదుపు తప్పుతాయి. ముఖ్యంగా కాలు, చేతులు పనిచేయకుండా పోతాయి.

పక్షవాతం రాకుండా ఉండాలంటే ముందుగా కచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే.. మద్యపానం, ధూమపానం మానేయడం.ఈ అలవాట్లు ఉంటే కచ్చితంగా పక్షవాతం వచ్చే అవకాశం వుంది. కాబట్టి తక్షణమే మద్యపానం, ధూమపానం మానుకోండి. ఎందుకంటే వీటి ప్రభావం ఎక్కువగా మన మెదడు పై పడే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం వుంది. షుగర్, బీపి వున్నవావారికి, అలాగే 50 ఏళ్ల వయసు పైబడిన వారికి పక్షవాతం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు మెడికల్ టెస్టులు చేయించుకోండి. బరువు పెరగకుండా వ్యాయామం, యోగ రెగ్యులర్ గా చేయండి. సమతుల ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. బీపీ 130/80 లోపే ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. మీరు తినే ఆహారంలో ఉప్పు కొంచెం తగ్గించండి. జంక్ ఫుడ్ తినడం మానేయండి. రోజు గోరు వెచ్చని నీటితో స్నానం చెయ్యండి. గోరు వెచ్చని నీటితో స్నానం చెయ్యటం వల్ల గుండె సమస్యలు రావు. అందువల్ల పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉండదు.

కాబట్టి అందరు కచ్చితంగా ఈ పద్ధతులు పాటించండి. ఈ పద్ధతులు పాటిస్తే పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉండదు. కాబట్టి ముందు జాగ్రత్తలు పాటించండి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: