టీజోన్.. కరోనా మీకు రాకుండా ఉండాలంటే.. ఈ టీ జోన్ ను కాపాడుకోవాలి. ఈ టీ జోన్ ఏంటి అనుకుంటున్నారా.. మన శరీరంలోని.. ముఖంపై కళ్లు, ముక్కు, నోరు.. ఈ మూడింటినీ కలిపి చూస్తే ఇంగ్లీష్ అక్షరం T ఆకారంలో ఉంటాయి. గమనించారా... దీన్నే టీ-జోన్‌గా అని పిలుస్తారు.
కేవలం కరోనా అనే కాదు.. మన శరీరంలోకి ఏ సూక్ష్మ జీవులు వెళ్లాలనే ప్రధానంగా ఈ T జోన్ నుంచే వెళ్తుంటాయి. అందుకే.. కోవిడ్-19 బారినపడకుండా చూసుకోవాలంటే ముఖాన్ని పదేపదే తాకొద్దనీ మాస్కులు పెట్టుకోవాలనీ నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ముఖంపై టీ-జోన్‌గా పిలిచే ప్రాంతాన్ని పరిరక్షించుకోవడమే దీని లక్ష్యం.
సాధారణంగా మనకు తెలియకుండానే మనం చాలా సార్లు ముక్కును రుద్దుకోవటం, కళ్లు నులుముకోవటం, వేళ్లతో పెదాలను తాకుతుండటం చేస్తుంటాం. మిగిలిన సమయాల్లో ఎలా ఉన్నా.. ప్రస్తుతం కరోనా ముప్పు వణికిస్తున్న నేపథ్యంలో ఈ అలవాట్లకు స్వస్తి పలకాలి. ఈ T జోన్ ను కాపాడుకోవాలి.
అందుకే ముఖానికి మాస్కులు ధరిస్తే.. సహజంగానే ముక్కు, నోరును తాకడం అంత సులభం కాదు.. కళ్లు నులుముకునే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఈ కీలకమైన టీజోన్ లోకి వైరస్ వెళ్లకుండా కాపాడుకుంటే.. కరోనా రాకుండా చూసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
మరింత సమాచారం తెలుసుకోండి: