వ్యాధినిరోధక శక్తి పెరగాలంటే ఇలా..

Kavya Nekkanti
శరీరంలో కూడా వాతావరణంలో ఏ చిన్న మార్పు జరిగినా, దానికి తగ్గట్టుగా మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు సరిగా జరిగితే సరి, లేదంటే తగ్గట్టుగా ఏదో ఒక సమస్య తలెత్తుతుంది. రోగ నిరోధ వ్యవస్థ జీవుల శరీరానికి రక్షణ వ్యవస్థ. వాస్త‌వానికి మ‌న శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డం వ‌ల్ల‌నే అనేక ర‌కాల అనారోగ్యాల బారిన ప‌డ‌తామ‌ని అంద‌రికీ తెలిసిందే. కొంద‌రికి ఈ శ‌క్తి ఎక్కువ‌గా ఉంటుంది. మ‌రికొంద‌రికి వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంటుంది.  వ్యాధినిరోధశక్తి తక్కువగా ఉన్నవారు త‌ర‌చూ అనారోగ్యాల బారిన ప‌డ‌తారు.


అయితే వ్యాధినిరోధ‌క శ‌క్తి పెంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. దీని కోసం ఆహారంలో పీచుపదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఓట్స్, బ్రౌన్ రైస్, బార్లీ తీసుకోవడం మంచిది. పెరుగులోనూ యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. క‌నుక పెరుగును రోజూ ఆహారంలో భాగంగా తింటుంటే అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త తీసుకోవ‌చ్చు. గ్రీన్ టీని ఒక సూపర్ ఆహారం అని చెప్పవచ్చు. ఎందుకంటే శరీరంలో ప్రతి అవయవం పనితీరు బాగుండేలా రోగనిరోదక శక్తిని పెంచుతుంది.


ఆహారంలో ఉల్లిపాయలు, వెల్లుల్లిని క‌చ్చితంగా తీసుకోవాలి. వీటిలో బాక్టీరియా, వైర‌స్‌ల‌తో పోరాడే గుణాలు ఉన్నాయి. దీంతో శరీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి అనారోగ్యాలు రావు. తేనెలో కూడా యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు ఉన్నాయి. దీన్ని త‌ర‌చూ తింటూ ఉంటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. గోరువెచ్చటి పాలల్లో పసుపు కలుపుకొని తాగితే కూడా వ్యాధినిరోధక శక్తి పెరిగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: