జూన్ 17వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

Suma Kallamadi
ప్ర‌తి సంవ‌త్స‌రంలో ఉండే చాలా తేదీల‌కు ఎన్నో విశేషాలు, వింత‌లు క‌లిగి ఉంటాయి. ఆ తేదీల్లో ఎన్నో ర‌కాల ప్ర‌ముఖ‌మైన చ‌రిత్ర‌ల‌కు అద్దంలా నిలిచి ఉంటాయి. ఆ రోజు ఖ‌చ్చితంగా ఏదో ఒక విశేష‌మైన స‌న్నివేశం క‌చ్చితంగా జ‌రుగుతుంది. ఇక అలాంటి డేట్ల‌ను మ‌నం గుర్తు పెట్టుకుని మ‌రీ సెల‌బ్రేట్ చేసుకుంటాం. ఇక చరిత్ర‌లో ఈరోజు జూన్ 17కి కూడా ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
♥ జననాలు ♥
✦  1239: ఇంగ్లాండుకు చెందిన రాజు మొదటి ఎడ్వర్డ్(మ.1307) జ‌న్మించారు.
✦  1682: స్వీడన్ రాజు అయిన చార్లెస్-12(మ.1718) జ‌న్మించారు.
✦  1913: సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, తెలుగుతో పాటు కన్నడ, తమిళ, సంస్కృత, ప్రాకృతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త అయిన తిరుమల రామచంద్ర(మ.1997) ఈరోజు జ‌న్మించారు.
✦  1973: భారత టెన్నిస్ క్రీడాకారుడు అయిన లియాండర్ పేస్ ఈరోజు జ‌న్మించారు.
 
♡ మరణాలు ♡
✦ 1631: ముంతాజ్ మహల ప్ర‌సవ సమయంలో ఆమె మరణించింది. దీంతో ఆమె జ్ఞాపకార్ధం, ఆవిడ భర్త, మొగల్ చక్రవర్తి షాజహాన్ 1, ముంతాజ్ మహల్ సమాధిగా తాజ్ మహల్ ని 20 ఏండ్లు కష్టపడి నిర్మింపచేసాడు.
✦ 1858: భారత స్వాతంత్య్ర‌ పోరాట యోధురాలు అయిన ఝాన్సీ లక్ష్మీబాయి(జ.1828) జ‌న్మించారు.
✦ 1946: ప్రసిద్ధ తెలుగు రచయిత అయిన చిలకమర్తి లక్ష్మీనరసింహం(జ.1867) జ‌న్మించారు.
✷ పండుగలు, జాతీయ దినాలు ✷
✦ ప్రపంచ ఎడారి, కరవు వ్యతిరేక దినం
✦ జెమ్లా ఇంతిఫద డే (సహ్రావి ఆరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్)
✦ బంకర్ హిల్ డే (సఫోల్క్ కంట్రీ, మసాచుసెట్స్, అమెరికా)

✷ సంఘటనలు ✷
✦  1775: ఈ రోజు బోస్టన్ బయట వున్న బంకర్ హిల్ ని, బ్రిటిష్ సైన్యం స్వాధీనం చేసుకుంది.
✦  1789: ఫ్రాన్స్ లోని మూడవ ఎస్టేట్ (సామాన్య జనం) తమంతట తామే, నేషనల్ అసెంబ్లీ గా ప్రకటించుకున్నారు. దీన్నే ఫ్రెంచి రివల్యూషన్ గా చెబుతుంటారు.
✦  1885: స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గా పిలువబడే ప్రఖ్యాత శిల్పం ఈ రోజు న్యూయార్క్ ఓడరేవు ను చేరింద‌ని చ‌రిత్ర చెబుతుంది. (ప్రెంచి దేశ ప్రజలు బహూకరించారు అమెరికన్లకు).
✦  1940: 3 బాల్టిక్ దేశాలను ( ఎస్తోనియా, లాట్వియా, లిథూనియా) ఈ రోజు సోవియట్ యూనియన్ ఆక్రమించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: