ఉక్కులాంటి ఎముకల కోసం ఇలా చేసి చూడండి..!

Divya
ఈమధ్య కాలంలో కొంచెం పనిచేసినా అలసట,నీరసం, లేదా కొంచెం కాలు జారితే చాలు కాళ్ళు బెనకటం లేదా కాలు విరగడం,కొంచెం ఎత్తు నుంచి పడిన వెంటనే చేతులు కాళ్లకు దెబ్బలు తగలడం వంటి ఎముక సమస్యలు వస్తూనే ఉన్నాయి.దీనికి కారణం మన శరీరంలో కాల్షియం లెవెల్స్ తగ్గిపోవడమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.మన శరీరంలో క్యాల్షియంలవాలని తక్కువ ఖర్చులు పెంచుకోవాలి అంటే రాగులతో జావను కాచుకొని తాగితే చాలని పోషకాహరులు చెబుతున్నారు.అదిక ప్రయోజనాలు పొందడానికి రాగిజావా ఎలా కాచుకోవాలో ఇప్పుడు చూద్దాం..
రాగి జావా తయారు చేసే విధానం..


దీని కోసం అరకేజి రాగులను నీళ్ళు పోసి రాత్రి నానబెట్టి, ఉదయాన్నే వడకట్టాలి.ఇలా వడకట్టిన రాగులను ఒక గుడ్డ ముక్కలు వేసి బాగా టైట్ గా మూట కట్టి రెండు రోజులు అలా వదిలేయాలి.దీనితో రాగులు మొలకెత్తుతాయి.ఇలా మొలకెత్తిన రాగులను బాగా ఆరబెట్టి, మిక్సీ పట్టి  బాగా జెల్లించాలి.ఇప్పుడు సాధారణ రాగిపిండి కంటే అధిక ప్రయోజనాల కలిగిన రాగిపిండి మరియు మెత్తగాను తయారవుతుంది.రాగి జావా కాయడం కోసం ఒక గిన్నెలో ఒక గ్లాసు పాలు పొసి, అందులో మూడు స్పూన్ల బెల్లం వేసి బాగా మరిగించాలి.

ఆ తర్వాత మనం తయారు చేసుకున్న రాగి పిండిని రెండు స్పూన్ల మోతాదులో కొంచెం పాలతో లిక్విడ్ లాగా కలుపుకొని పెట్టుకోవాలి.ఇప్పుడు బాగా మరిగిన పాలల్లో ఈ రాగి పిండిని కలిపి,బాగా కలుపుతూ మరిగిస్తూ ఉండాలి. ఇది క్రమంగా జావా లాగా తయారైన తర్వాత నుంచి చల్లారనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడేత్రాగటం చాలా మంచిది. ఇలా రోజు ఉదయాన్నే కాఫీ టీ బదులుగా తాగుతూ ఉంటే ఎముకలకు క్యాల్షియం పుష్కలంగా అంది,ఎముకలు ఉక్కులా తయారవుతాయి. జావను ఆరు నెలల పసిబిడ్డ నుంచి కడుముసలి వారి వరకు ఇవ్వవచ్చు. దీనివల్ల పిల్లలు పెరుగుదల  సక్రమంగా ఉంటుంది. మరియు శరీరం డిహైడ్రేషన్ కాకుండా కూడా కాపాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: