కిడ్నీ స్టోన్స్‌, గాల్‌ స్టోన్స్‌ సమస్య తగ్గే టిప్స్?

Purushottham Vinay
కిడ్నీ స్టోన్స్‌ కన్నా కూడా గాల్‌ స్టోన్స్‌ వల్ల ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే అవి హఠాత్తుగా అత్యవసర పరిస్థితికి దారి తీస్తాయి.ఈ సమస్య మరింత ముదరక ముందే అప్రమత్తం కావాలి. కాలేయం కింద పియర్‌ పండు ఆకారంలో ఉండే పిత్తాశయం జీర్ణక్రియకు ఎక్కువగా తోడ్పడుతూ ఉంటుంది.అలాగే కాలేయంలో తయారయ్యే జీర్ణరసం ఇంకా బైల్‌ డక్ట్‌ ద్వారా పిత్తాశయం గుండా చిన్న పేగుల్లోకి చేరుకుంటూ ఉంటుంది. మన పేగులు ఈ బైల్‌ను కొవ్వు పదార్థాలను జీర్ణం చేసుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటాయి.ఈ గాల్‌స్టోన్స్‌లో రెండు రకాలుంటాయి. సాధారణంగా 80 మందిలో కొలెస్ట్రాల్‌ గాల్‌ స్టోన్స్‌ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇవి పసుపు ఇంకా ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. ఇక రెండో రకం పిగ్మెంట్‌ గాల్‌ స్టోన్స్‌ ముదురు రంగులో చిన్నవిగా ఉంటాయి. ఇవి బైల్‌ స్రావాల్లోని బైల్‌రుబిన్‌ కారణంగా  ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే 25 నుంచి 45 ఏళ్ల వయస్కుల్లో ఈ సమస్య ఎక్కువగా బయటపడుతూ ఉంటుంది.


ఇంకా అలాగే ఈ సమస్య వంశపారంపర్యంగా కూడా కొనసాగుతుంది.అధిక బరువు వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ అనేది పెరుగుతుంది. దాని ఫలితంగా పిత్తాశయం పూర్తి స్థాయిలో ఖాళీ కాకపోవడం మూలంగా రాళ్లు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి బైల్‌ స్టోన్స్‌కు ఓ కారణం అధిక బరువుగా కూడా మనం చెప్పుకోవచ్చు.నిమ్మరసం ఇంకా ఆలివ్‌ ఆయిల్‌లను కలిపి తాగాలి. అలాగే వెంటనే నీళ్లు కూడా తాగాలి. ఈ టిప్ ని రోజులో రెండు నుంచి మూడు సార్లు, వరుసగా మూడు రోజుల పాటు పాటించాలి. అలాగే దీనికి ప్రత్యామ్నాయంగా ఒకటి నుంచి రెండు వారాల పాటు రోజుకు ఒక గ్లాసు చొప్పున 100 శాతం పూర్తి నిమ్మరసంని మీరు తాగాలి.అలాగే ఉదయాన్నే పరగడుపున దానిమ్మ రసం తాగాలి. దానిమ్మ రసాన్ని ఉలవలతో తయారుచేసిన సూప్‌తో కలిపి మధ్యాహ్నం పూట తాగాలి. ఇలా వారం పాటు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: