డ్రై ఫ్రూట్స్ ఇలా తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం?

Purushottham Vinay
కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను తినడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే వీటిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువగా శక్తి లభిస్తుంది. బ్రెజిల్ నట్స్, జీడిపప్పు, మెకడామియా నట్స్ లో ఈ కొవ్వు పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా అలాగే ఉప్పు వేసి వేయించిన డ్రై ఫ్రూట్స్, చక్కెర పొడి వేసి వేయించిన డ్రై ఫ్రూట్స్ ను అస్సలు తీసుకోవద్దని వీటిలో ఉప్పు, కొలెస్ట్రాల్ స్థాయిలు మరింత ఎక్కువగా ఉంటాయని ఇటువంటి డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల గుండెకు మరింత హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనం ఎలాంటి ప్లేవర్స్ లేని డ్రై ఫ్రూట్స్ ను మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా నేరుగా డ్రై ఫ్రూట్స్ ను తీసుకోలేని వారు కేక్స్, డిసర్ట్స్, స్మూతీ వంటి వాటిలో వీటిని వేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా అలాగే కొన్ని సందర్భాలల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్ మనకు మరింత హానిని కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక బరువు తగ్గాలనుకునే వారు చాలా మంది కూడా డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం మంచిదే అయినా కూడా వీటిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.


వీటిలో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి.ఇంకా అలాగే గుండెకు హాని కలుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు నిపుణులు సూచించిన మోతాదులో మాత్రమే డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా అలాగే కొందరిలో డ్రై ఫ్రూట్స్ ను తిన్న తరువాత కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువగా పైటేట్స్, టానిన్ లు అనేవి ఉంటాయి. వీటి కారణంగా డ్రై ఫ్రూట్స్ అంత త్వరగా జీర్ణం కావు.ఇంకా అలాగే డయేరియా కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డ్రై ఫ్రూట్స్ ను తగిన మోతాదులోఅది కూడా నానబెట్టి తీసుకోవడం మంచిది. ఇంకా అలాగే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఫుడ్ పాయిజన్ కు దారి తీస్తాయి. బ్రెజిల్ నట్స్, జీడిపప్పు వంటి వాటిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మనపై అవి ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. కాబట్టి వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి వాటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మాత్రమే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని లేదంటే చాలా దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: