పొద్దున్నే కాఫీ తాగేవారికి షాకింగ్ న్యూస్?

Purushottham Vinay
చాలా మందికి కూడా ఎక్కువగా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే కాఫీ తాగిన వెంటనే, శరీరంలో అద్భుతమైన తాజాదనం కనిపించడం ప్రారంభమవుతుంది.మన శరీరానికి ఎంతో మేలు చేసే ఈ అద్భుతమైన డ్రింక్ లో అనేక పోషకాలు ఉన్నాయి. అయితే కొందరు కాఫీని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇది శరీరానికి హానికరం అని నిరూపించబడింది. ముఖ్యంగా ఉదయాన్నే కాఫీ తాగడం అస్సలు మంచిది కాదు. ఉదయాన్నే కాఫీ ఎందుకు తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.కాఫీలో పెద్ద మొత్తంలో కెఫీన్ అనేది ఉంటుంది.అందువల్ల రక్తపోటు వేగంగా పెరుగుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని ఈజీగా పెంచుతుంది. మీకు గుండె జబ్బులు ఉన్నట్లయితే లేదా అధిక bp ఉన్నట్లయితే చాలా తక్కువ పరిమాణంలో కాఫీని త్రాగండి.అయితే మనకు రిఫ్రెష్‌గా అనిపిస్తుందని కాఫీ తాగుతాం.. దీనివల్ల నిద్ర, అలసట ఈజీగా మాయమవుతుంది.


చురుకుదనం పెరుగుతుంది కానీ కాఫీ ఎక్కువగా తాగితే కెఫీన్ వల్ల సరైన సమయానికి నిద్ర రాకపోవడమే కాకుండా నిద్రపోయే విధానం కూడా పూర్తిగా చేంజ్ అయిపోతుంది.అలాగే రోజులో 5 లేదా 6 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగే వారికి డిమెన్షియా వ్యాధి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.ఇక ఇది ఒక మానసిక వ్యాధి..అందుకే దీనిలో రోగి మానసికంగా సాధారణంగా ప్రవర్తించలేరు. అలాగే దీని వల్ల అధిక రక్తపోటు, గుండెపోటు ఇంకా పక్షవాతం వంటి వ్యాధులు రావచ్చు.అలాగే పెద్దప్రేగు కార్యకలాపాలను పెంచే గ్యాస్ట్రిన్ హార్మోన్‌ను విడుదల చేయడం వల్ల కాఫీ తాగడం వల్ల మన పొట్టపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది. మీరు ఎక్కువగా కాఫీ తాగితే అజీర్తి సమస్య ఇంకా ఎసిడిటీ లాంటి సమస్యలు తలెత్తవచ్చు.కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు కాఫీని మాత్రం అస్సలు తాగకండి. లేదంటే ఖచ్చితంగా అనేక రకాల అనారోగ్య సమస్యలని ఎదుర్కోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: