వీటిని తీసుకుంటున్నారా? అయితే ప్రాణానికే ముప్పు?

Purushottham Vinay
సకారిన్, సుక్రాలోజ్, నియోటేమ్, ఆస్పర్టేమ్ వంటి అర్టిఫిషియల్ స్వీటెనర్లు మార్కెట్‌లో చాలా ఎక్కువగా లభిస్తున్నాయి. అయితే వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని, వీటి కారణంగా గుండె సంబంధిత సమస్యలు ఇంకా కాలేయానికి హాని కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా అంతేకాక వీటిని తినేవారికి మూడ్ స్వింగ్స్ సమస్యలు వస్తాయని వివరిస్తున్నారు. ఈ క్రమంలో అర్టిఫిషియల్ స్వీటనర్ల కారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.తక్కువ కేలరీలను కలిగి ఉంటాయని తీసుకునే ఈ అర్టిఫిషియల్ స్వీటనర్లు మన మెదడులోని న్యూరో ట్రాన్స్‌మిటర్ లెవెల్స్‌ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల మానసిక స్థితి, ప్రవర్తనలో మార్పులు ఎదురవుతాయి. ఇంకా మెదడులోని సిరటాయిన్ లెవెల్స్ నియంత్రణలోకి వచ్చి మానసిక ఆందోళనకు, తలనొప్పి ఇంకా మైగ్రేన్ వంటి సమస్యలకు దారితీస్తాయి.అర్టిఫిషియల్ స్వీటెనర్లు మెదడు పనితీరు ఇంకా నాడీవ్యవస్థ మీద ప్రభావం చూపుతాయి. న్యూరో ట్రాన్స్‌మిటర్ స్థాయిల్లో మార్పు అలాగే రక్త సరఫరాలో మార్పుకు కూడా కారణమవుతాయి.


అందువల్ల తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు కనిపిస్తాయి.అర్టిఫిషియల్ స్వీటెనర్లు టైప్ 2 డయాబెటిస్ ఇంకా గుండె వ్యాధులకు కారకాలుగా పనిచేస్తాయని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. ఇంకా అంతేగాక ఈ రకమైన స్వీటెనర్లు ఇన్సులిన్ నిరోధకతను పెంచి కడుపులో మంట కలిగేలా చేస్తాయి. ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు అనేవి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి కారకాలు.ఈ అర్టిఫిషియల్ స్వీటెనర్లలో ట్రై గ్లిసారాయిడ్లు అనే కొవ్వులు ఉంటాయి. ఇవి కాలేయంలో పేరుకొనిపోయి దాని పనితీరు ఇంకా ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి.తక్కువ కేలరీలన కలిగి ఉండడమే కాక రుచిలో చక్కెరలా ఉంటాయని ఈ మధ్య కాలంలో అర్టిఫిషియల్ స్వీటనర్ల ప్రాముఖ్యత బాగా పెరిగింది.అయితే వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలున్నాయని చాలా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా వీటిని తినడం వల్ల  శరీరానికి కేలరీలను నియంత్రించే సామర్థ్యం తగ్గిపోతుందంట. అందువల్ల విపరీత స్థాయిలో బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: