అధికంగా వంట సోడా వాడుతున్నారా..?

Divya
సాధారణంగా మహిళలు చాలా రకాల వంటల్లో వంట సోడాను వాడుతుంటారు.ముఖ్యంగా దోశ,ఇడ్లీ పిండి పులియబెట్టడానికి వంట సోడాను వేస్తుంటారు.కానీ అది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని,అధిక మోతాదులో,ఎక్కువ కాలం పాటు వాడితే చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.కావున వంట సోడా బదులుగా వేరే పదార్థాలను ఉపయోగించడం చాలా మంచిదని చెబుతున్నారు.

ఎక్కువగా బేకింగ్ సోడా,వంట సోడాను పిండి పులియబెట్టేందుకు అధికంగా ఉపయోగిస్తుంటారు.కేక్ లు, మఫిన్లు, బ్రెడ్లు,కుకీలు అనే కాదు,దోశ,ఇడ్లీ పిండిని వేగంగా పులిసేందుకు ఉపయోగపడుతుంది.నిజమే సోడా తొందరగా పిండిని పులిసేలా చేస్తుంది.దీనిని హోటళ్లలోనూ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.అస్సలు ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా..
అనారోగ్య సమస్యలు..
బేకింగ్ సోడాను అధికంగా తినడం వల్ల అధిక రక్తపోటును కలిగిస్తుంది. దీనికి కారణం ఇందులో సోడియం బైకార్బోనేట్ ఉండడమే.దీనికి బీపీని పెంచే రసాయనం గుణం ఉంటుంది.కేక్, బిస్కెట్ వంటివి అధికంగా తీసుకుంటే, ఇందులోని బేకింగ్ సోడా రోగ నిరోధక వ్యవస్థ బలహీనపరుస్తుంది.ఇది శరీరాన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు,అలెర్జిక్ రియాక్షన్లకు గురిచేస్తుంది.వీటిని తరుచూ తీసుకోవడం వల్ల
మూత్రపిండాలు దెబ్బతినె అవకాశం ఎక్కువగా ఉంటుంది .
వంట సోడాలో శరీరానికి కావాల్సిన ఎలాంటి పోషకాలు ఉండవు.ఇందులో ఫాస్ఫారిక్ యాసిడ్ అధికంగా ఉండడం వల్ల,పొట్టలో యాసిడ్ గుణాన్ని పెంచి జీర్ణశక్తి మందగించేలా చేస్తుంది.దీని కారణంగా మనం తిన్న ఆహారంలను పోషకాలు గ్రహించే శక్తి తగ్గిపోతుంది.
బేకింగ్ సోడాతో క్లోమం ఇన్సులిన్ ను అధికంగా ఉత్పత్తి చేస్తుంది కనుక ఇది రక్తంలో తొందరగా కలిసిపోయి షుగర్ లేవలసిన పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. సోడాలోని ఫాస్ఫారిక్ యాసిడ్ ఎముకలపై దాడి చేసి,గుల్లబారేలా చేస్తుంది.దీంతో ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది.
సోడాపొడిని వాడేందుకు బదులుగా ముందు రోజు రాత్రి పిండి రుబ్బుకొని రాత్రంతా పులుసేలా చేసుకోవడం చాలా మంచిది.బిస్కెట్స్ కేకులు వంటివి తయారు చేసుకునేటప్పుడు బేకింగ్ సోడా బదులుగా ఈస్ట్ లేదా గుడ్లు ,ఫ్లాక్స్ జెల్ వంటివి ఉపయోగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: