ఆవాలు చేసే మేలు అంతా ఇంత కాదు?

Purushottham Vinay
తాళింపుల్లో ఆవాలని ఎక్కువగా వాడతారు. ఈ ఆవాలు వేయనిదే మనం కూరలను తయారు చేయము.వీటిని వేస్తే కూరలు చాలా రుచికరంగా ఉంటాయి.ఆవ పిండిని మనం పచ్చళ్లల్లో తయారీలో ఉపయోగిస్తాము. ఆవాల నుండి తీసిన నూనెను కూడా మనం వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తాము. వంటల్లో వాడడంతో పాటు ఆయుర్వేదంలో ఔషధాల తయారీలో కూడా ఆవాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆవాల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఆవాలను అలాగే ఆవ నూనెను వాడి మనం చాలా రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.ఆవ నూనెను అలాగే ఆవాలను వాడడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.తేలు విషాన్ని తగ్గించే గుణం కూడా ఆవాలకు ఉంది. ఆవాలు, పత్తిఆకులని కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని తేలు కుట్టిన చోట కనుక ఉంచితే విషం పోతుంది. అలాగే ఆవాల నూనెను 50 గ్రాముల మోతాదులో తీసుకుని వాటిని గోరు వెచ్చగా చేయాలి. ఆ తరువాత ఇందులో 20 అమృతధార చుక్కలను వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చర్మంపై రాస్తే దురదలు ఇంకా దద్దుర్లు వెంటనే తగ్గుతాయి. అలాగే ఈ ఆవాలను దోరగా వేయించి పొడిగా చేయాలి. ఈ పొడిని రెండు చిటికెల మోతాదులో రాత్రి భోజనంలో మొదటి ముద్దగా తింటే పెద్దలకు ఇక బట్టలల్లో మూత్రం పడకుండా ఉంటుంది.అలాగే నీళ్ల విరేచనాలను తగ్గించడంలో కూడా ఆవాలు చాలా బాగా పని చేస్తాయి.


దోరగా వేయించిన ఆవాలను ఇంకా బెల్లాన్ని సమానంగా తీసుకుని వాటిని మెత్తగా దంచాలి. ఈ మిశ్రమాన్ని బఠాణీ గింజలంత మాత్రలుగా చేసి స్టోర్ చేసుకోవాలి. ఈ మాత్రలను పూటకు ఒకటి చొప్పున రెండు పూటలా తీసుకుంటే నీళ్ల విరోచనాలు చాలా ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే ఆవాలను మంచి నీటితో కలిపి వాటిని మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని ముక్కు దగ్గర వాసన తగిలేటట్టు కనుక ఉంచితే మూర్ఛ వల్ల స్పృహ కోల్పోయిన వారికి ఈజీగా మెలుకువ వస్తుంది.ఇంకా అలాగే బోదకాలును హరించే గుణం కూడా ఆవాలకు ఉంది. ఆవాలు, ఉమ్మెత్తాకులు, ఆముదపు చెట్టు వేర్లు ఇంకా మునగ చెట్టు బెరడు.. వీటన్నింటిని సమానంగా తీసుకుని నీటితో కలిపి బాగా మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని బోదకాలు వాపులపై రాసి కట్టు కడితే ఈజీగా వాపులు తగ్గుతాయి. అలాగే దానిమ్మ బెరడును తగినంత ఆవ నూనెతో కలిపి మెత్తగా నూరాలి.తరువాత దాని నుండి రసాన్ని తీసి స్టోర్ చేసుకోవాలి. స్త్రీలు ఈ రసాన్ని రాత్రి పడుకునే ముందుగ స్థనాలపై రాసుకుని మసాజ్ చేసుకోవాలి. తరువాత దూదిని ఉంచి బిగుతైన లో దుస్తులను వేసుకోవాలి.ఇక ఇలా చేయడం వల్ల స్త్రీలల్లో స్థనాలు బాగా బిగుతుగా తయారవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: