గ్రీన్ టీలో ఇది కలిపి తాగితే బోలెడు ప్రయోజనాలు?

Purushottham Vinay
మన ఆరోగ్యానికి గ్రీన్ టీ చాలా రకాలుగా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ ని మనలో చాలా మంది కూడా రెగ్యులర్ గా తాగుతూ ఉంటారు.ఈ గ్రీన్ టీ ని తాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. గ్రీన్ టీ మనకు షాపుల్లో ఇంకా సూపర్ మార్కెట్ లలో చాలా సులభంగా లభిస్తుంది. ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ లో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి తీసుకుంటే మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ ని తాగడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి  తెలుసుకుందాం. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా సహాయపడతాయి. అలాగే ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని గుండె జబ్బులు, డయాబెటిస్ ఇంకా క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడడంలో సహాయపడతాయి. ఉదయాన్నే గ్రీన్ టీ ని తాగడం వల్ల మనం రోజంతా చాలా ఉత్సాహంగా ఉండవచ్చు.గ్రీన్ టీ లో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల మనం చాలా ఈజీగా బరువు తగ్గవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించి ఆరోగ్యవంతంగా బరువు తగ్గేలా చేయడంలో గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ టీని రోజూ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


ఇంకా అదే విధంగా డయాబెటిస్ తో బాధపడే వారు వారి రోజూ వారి ఆహారంలో ఒక కప్పు గ్రీన్ టీ ని చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఈజీగా అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ డయాబెటిస్ ను అదుపులో ఉంచడంతో పాటు డయాబెటిస్ కారణంగా తలెత్తే అనేక అనారోగ్య సమస్యల బారిన కూడా పడకుండా చేస్తుంది. గ్రీన్ టీ లో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల ఇన్ ప్లామేషన్ తగ్గడంతో పాటు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఈజీగా పెరుగుతాయి.దీంతో మన గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గ్రీన్ టీ లో నిమ్మరసం కలిపి తాగడం వల్ల మెదడు చక్కగా పని చేస్తుంది.మెదడుకు సంబంధించిన సమస్యలు ఏవి రాకుండా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. గ్రీన్ టీ ని తాగడం వల్ల మనకు మేలు కలిగినప్పటికి దీనిని ఎక్కువగా తాగడం వల్ల వివిధ రకాల దుష్ప్రభావాల బారిన కూడా పడే అవకాశం ఉంది.కాబట్టి రోజూ ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీని మాత్రమే తీసుకోవాలని అప్పుడే చక్కటి ఆరోగ్యాన్ని పొందగలమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: