ఇమ్యునిటీని పెంచుకోవాలంటే ఈ పాలు తాగండి?

Purushottham Vinay
ఇక మన బాడీలో ఇమ్యునిటీ (రోగనిరోధకత) పెంచుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వంటింట్లో దొరికే ఈ మూడు పదార్ధాలతో చిటికెలో ఇమ్మునిటీ పవర్ ని పెంచుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. సంపూర్ణ ఆహారంగా పిలిచే పాలలో చాలా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా గ్లాసుడు పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. పాలు తాగడం వల్ల ఎముకలు చాలా దృఢంగా ఉండడంతోపాటు మన శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా ఈజీగా అందుతాయి. పాలలో స్పూన్ తేనె, దాల్చినచెక్క పొడి చిటికెడు కలుపుకుని ప్రతి రోజూ తాగితే ఏ రోగాలు మన దరి చేరవు. రోగనిరోధక వ్యవస్థ కూడా చాలా బలపడుతుంది.ఇంకా అంతేకాకుండా  ఎన్నో లాభాలు కలుగుతాయి.పాలలో దాల్చిన చెక్క పొడి ఇంకా తేనె కలుపుకుని తాగడం వల్ల జీర్ణక్రియ చాలా బాగా మెరుగుపడుతుంది.


ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలన్నీ చాలా ఈజీగా మాయం అవుతాయి. మలబద్ధకంతో బాధపడేవారికి ఇది చాలా చక్కని పరిష్కారం. ఇంకా అలాగే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి చక్కని ఉపశమనం  కూడా ఇది అందిస్తుంది.అలాగే మన శరీరంలో కనుక చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంటే రక్తం ప్రవహించే సిరల్లో కొవ్వు గడ్డకట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాలలో దాల్చిన చెక్క ఇంకా తేనె కలుపుకుని తాగితే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది.ఇంకా అలాగే కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ పాలు మంచి దివ్యౌషధంలా పని చేస్తుంది. ఎందుకంటే దీనిలోని ఔషధ గుణాలు ఎముకలను బాగా బలపరిచి, కీళ్ల నొప్పులను చాలా ఈజీగా త్వరగా తగ్గిస్తుంది.కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పాలని తయారు చేసుకొని తాగండి. ఎలాంటి రోగాలు రాకుండా రోగ నిరోధక శక్తిని ఈజీగా పెంచుకోండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఎలాంటి రోగాలు రాకుండా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: