"తెల్లజుట్టు" సమస్యతో నలుగురిలో తిరగడానికి ఇబ్బంది పడుతున్నారా ?

VAMSI
మాములుగా వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు రావడం తెలిసిందే. శరీరం ముడతలు పడి పోవడం, సన్నబడడం, బలహీనంగా మారడం మరియు తల వెంట్రుకలు సైతం తెల్లగా మారిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ వయసు పెరిగిన వారిలో వెంట్రుకలు తెల్లబడడం సహజమే. కానీ తక్కువ వయసు ఉన్న వారిలో కూడా వెంట్రుకలు తెల్లబడడం చాలా మందిలో చూస్తున్నాము. ఉదాహరణకు ఒక 18 నుండి 30 సంవత్సరాల లోపు యువత ఈ తెల్ల వెంట్రుకల సమస్య వలన నలుగురిలోకి వెళ్లి మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఈ సమస్యను ఎలా అయినా అధిగమించాలన్న ఆలోచనతో మార్కెట్ లో ఉన్న రకరకాల రసాయనాలను తలకు వాడడం చేస్తున్నారు. కానీ ఇలా చేయడం వలన జుట్టుకు సంబంధించిన కొత్త కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని డాక్టర్స్ చెబుతున్నారు. అందుకే సహజంగా కొన్ని పదార్ధాలను వాడి చేసుకున్న ఒక మిశ్రమాన్ని తలకు దట్టించడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వుండకపోవడమే కాక, ముందు ముందు మీ తెల్ల జుట్టు పూర్తి నల్లగా మారుతుంది అంటూ ప్రముఖులు చెబుతున్నారు.
మనకు తెలిసిన గోరింటాకును ముందుగా పేస్ట్ గా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ కు టీ లీఫ్ వాటర్ లేదా కాఫీ వాటర్ ను ఉసిరి కాయల పొడిని కలిపి ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించే ముందు తలను మంచి నీటితో తడిగా చేసుకోవాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని జుట్టుకు పూర్తిగా పట్టించి ఒక 25 నిముషాల పాటు అందులోని పోషకాలు వెంట్రుకల్లోకి వెళ్లేలా సమయం ఇవ్వాలి. ఆ తర్వాత ఏదైనా సహజ పదార్ధాలు వాడిన షాంపూ ను వాడి తల స్నానం చేయాలి. ఇలా మీరు చేస్తూ ఉంటే కొంత కాలానికి నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: