మెదడు బాగా పని చెయ్యాలంటే ఇవి తినండి?

Purushottham Vinay
మెదడు బాగా పని చేయాలన్నా, నాడీ కణాలు ఆరోగ్యంగా ఉండాలన్నా మన శరీరానికి జింక్, విటమిన్ ఇ ఇంకా అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చాలా అవసరమవుతాయి. అయితే జింక్ లోపించడం వల్ల మెదడు చురుకుగా పని చేయదు. నాడీ కణాల పనితీరు కూడా తగ్గుతుంది.అంతేగాక జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది. గర్భిణీ స్త్రీలల్లో జింక్ లోపించడం వల్ల పుట్టబోయే పిల్లల్లో తెలివితేటలు తగ్గే ప్రమాదం కూడా వుంది. కాబట్టి పిల్లలకు జింక్ ఉండే ఆహారాలను ఎక్కువగా తినిపించాలి. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మెదడులో కణాలు కూడా చాలా చక్కగా పని చేస్తాయి. అలాగే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఎక్కువ కాలం పాటు మతిమరుపు ఇంకా అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మెదడు పనితీరు కూడా బాగా మెరుగుపడుతుంది. ఇంకా అలాగే విటమిన్ ఇ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఆలోచించేటప్పుడు ఎన్నో రకాల రసాయనాలు విడుదల అవుతాయి. ఈ రసాయనాలు అనేవి మెదడు కణాల జీవిత కాలాన్ని తగ్గిస్తూ ఉంటాయి.


ఈ రసాయనాలను విచ్చినం చేసి జ్ఞాపకశక్తిని ఇంకా అలాగే ఆలోచనా శక్తి పెంచడంలో విటమిన్ ఇ మనకు అవసరం. ఈ మూడు పోషకాలు కలిగిన ఆహారాలను నట్స్ , గింజలను తీసుకోవడం ద్వారా పొందవచ్చు.వీటివల్ల పిల్లలకు ఇవ్వడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆలోచనా శక్తి కూడా బాగా పెరుగుతుంది. వయసును బట్టి రోజుకు 7 నుండి 10 మిల్లీ గ్రాముల జింక్ మన శరీరానికి చాలా అవసరమవుతుంది. పొద్దు తిరుగుడు పప్పులో 7 మిల్లీ గ్రాములు, తెల్ల నువ్వుల్లో 8 మిల్లీ గ్రాములు ఇంకా నల్ల నువ్వుల్లో 8.5 మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది. వీటిని నానబెట్టి లేదా పొడిగా చేసుకుని తీసుకోవడం వల్ల మన శరీరానికి ఖచ్చితంగా తగినంత జింక్ లభిస్తుంది. అలాగే పిల్లలకు రోజుకు 1 గ్రాము ఇంకా పెద్దలకు 2 గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రోజుకు చాలా అవసరమవుతాయి. వాల్ నట్స్ లో 9 గ్రాములు, అవిసె గింజల్లో 13 గ్రాములు ఇంకా చియా విత్తనాల్లో 18 గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి.కాబట్టి వీటిని ఖచ్చితంగా తినండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: