కిడ్నీల వ్యాధికి పరిష్కారం ఏమిటి?

Purushottham Vinay
ఈరోజుల్లో కిడ్నీల సమస్యలు ఎక్కువవుతున్నాయి. కిడ్నీలు మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగాలు. వాటిని ఖచ్చితంగా కాపాడుకోవాలి. లేదంటే చాలా బాధతో చనిపోతారు. కిడ్నీలు సమస్యలు వచ్చేముందు ఖచ్చితంగా ఈ సమస్యలు వస్తాయి.మన మూత్రం రంగు మారినా ఇంకా అలాగే మూత్రం అసాధారణంగా ఉన్నా, కాళ్లవాపు ఎక్కువగా ఉన్నా ఖచ్చితంగా అది కిడ్నీ సమస్యగా గుర్తించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యంతో పాటు ఆకలి కూడా బాగా తగ్గిపోతుంది. తరచుగా వికారం రావడం ఇంకా వాంతులు చేసుకోవడం లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. కిడ్నీల పనితీరు తగ్గితే ఖచ్చితంగా ఎర్రరక్తకణాల ఉత్పత్తి మీద ఎఫెక్ట్‌ పడుతుంది. అలసటతో పాటు మెదడుకు సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయని వెల్లడిస్తున్నారు.అలాగే కిడ్నీలు ఉండే భాగంలో కూడా ఎక్కువగా నొప్పి వస్తుంటుంది. నొప్పితో పాటు కిడ్నీలో ఇన్‌ఫెక్షన్లు ఇంకా రాళ్లకు కూడా కారణమవుతుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కూడా చల్లగా ఉన్న ఫీలింగ్‌ మీకు ఉంటుంది. ఇది కిడ్నీల రోగానికి ఖచ్చితంగా సంకేతంగా భావించాలి. 


ఇందుకు మీరు వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.కిడ్నీల సమస్య తగ్గాలంటే రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలి. ఇంకా అలాగే క్యాప్సికంలో ఉండే విటమిన్‌ఎ, సీ, పోటాషియం వంటి పోషకాలు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి.ఎప్పుడూ కూడా వెల్లుల్లిని ఏదో ఒక రపంలో తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.అలాగే బెర్రీలలో ఫైబర్‌, విటమిన్లు ఇతర పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే మలినాలు ఈజీగా బయటకు పోయేలా చేస్తాయి.ఇంకా అలాగే ఓట్స్‌, కాలిఫ్లవర్‌, ఉల్లిపాయలు ఇంకా అలాగే పైనాపిల్స్‌ కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని బాగా మెరుగు పరుస్తాయి. అలాగే మీకు మూత్రం వచ్చినపుడు వెంటనే వెళ్లాలి. లేకపోతే కిడ్నీపై ప్రభావం చూపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: