బిగ్ షాక్: మందు ఎక్కువగా తాగితే పిల్లలు పుట్టరట ?

VAMSI
ఖచ్చితంగా ఇప్పుడు మనము చెప్పుకునే విషయం ఒక వర్గం వారికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ సమాజంలో మనుషులు ఎన్నో రకాలుగా ఉంటారు, మంచి వారు చెడు వారు... మద్యపానం అలవాటు ఉండేవారు , అలాగే మద్యపానం అలవాటు లేని వారు. కానీ కొన్ని అలవాట్లు మనకు చెడు చేస్తాయని తెలిసినా ఎందుకనో వాటికే బానిసలుగా మారుతుంటారు. అలాంటి భయంకరమైన అలవాట్లలో మద్యపానం కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఈ అలవాటు ఉన్నవారు ఎందరో తమ జీవితాలను మరియు కుటుంబాలను కోల్పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వాలు మరియు స్వచ్చంధ సంస్థలు సైతం ఈ అలవాటు మంచిది కాదని ప్రమోషన్ లు చేస్తూనే ఉన్నాయి .
తాజాగా  ఒక శాస్త్రవేత్త జరిపిన ప్రయోగ ఫలితం ప్రకారం మద్యం ఎక్కువగా తీసుకుంటే సంతాన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని తెలుపుతోంది. ఎక్కువగా మద్యాన్ని తీసుకోవడం వలన మన శరీరంలోని టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గిపోతాయట. అయితే ఈ విషయాన్ని విన్న వారంతా ఆశ్చర్య పోతున్నారు. మాములుగా ఇప్పటి వరకు కూడా మద్యం ఎక్కువగా తాగితే శరీరంలోని అవయవాలు మాత్రమే చెడిపోతాయి అని తెలుసు. కానీ ఈ విషయం మాత్రం కొత్తగా ఉందంటూ చర్చించుకుంటున్నారు. దీనితో మందు ఎక్కువగా తాగితే సెక్స్ సామర్ధ్యం తగ్గిపోయి తద్వారా పిల్లలు కలిగే సామర్ధ్యం తగ్గుతుందని దీని ద్వారా తెలుస్తోంది . 
కానీ ఇప్పుడు దీని గురించి ఒక కఠినమైన నిర్ణయం తీసుకునే సమయం అని చెప్పాలి. ఈ క్షణం వరకు కూడా కారణం ఏదైనా మందు తాగుతున్నారు. ఇక మీదట మాత్రం మద్యాన్ని తక్కువగా తీసుకోవడం లేదా అసలుకే మానెయ్యడం చెయ్యాలి. ముఖ్యంగా పెళ్లి కాని యువకులు మందు జోలికే వెళ్ళకపోవడం ఉత్తమం. మరి ఈ విషయం గురించి తెలియని చాలామందికి చెప్పి మందును ఆపేలా చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: