హైబీపిని కంట్రోల్ చేసే డైట్?

Purushottham Vinay
హైబీపిని కంట్రోల్ చేసే డైట్?

హెల్తీ లైఫ్ స్టైల్ ఇంకా హెల్తీ డైట్‌ను పాటించడం వల్ల హైబీపీని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. పొటాషియం చాలా ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల హైబీపీ కంట్రోల్ లోకి వస్తుంది. ఇంకా అలాగే ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. పొటాషియం చాలా ఎక్కువగా ఉండే ఆహారాలపై హైబీపితో బాధపడుతున్నవారు ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండటం అవసరం. శరీరంలో పోటాషియం స్థాయిని పెంచడంలోనే కాక ఎన్నో రకాల పోషకాలను అందించే  ఆహారపదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..పెరుగులో కాల్షియం ఇంకా అలాగే పొటాషియంలు పుష్కలంగా ఉండడం వల్ల ఇవి జీర్ణాశయంలో ఉండే మంచి బాక్టీరియాకు చాలా మేలు చేస్తాయి. హైబీపీ ఉన్నవారికి పెరుగు చాలా మంచి ఆహారం.. దీన్ని  తీసుకోవడం వల్ల హైబీపీ కంట్రోల్ లో ఉంటుంది.


అలాగే అరటి పండ్లలో పుష్కలంగా ఉండే పొటాషియం,విటమిన్ సి వంటి పోషకాలు మన శరీర జీర్ణశక్తిని బాగా పెంచుతాయి. దాని ఫలితంగా ఆకలి కంట్రోల్ లో ఉంటుంది. అరటి పండ్లలో చాలా ఎక్కువగా ఉండే ఫైబర్ ఎక్కువ సేపు ఆకలిని కలిగించకుండా కడుపు నిండుగా ఉంచుతుంది. దీంతో అధిక బరువును కూడా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. అలాగే అరటి పండ్లలో ఉండే పొటాషియం వల్ల హైబీపీ కూడా ఈజీగా తగ్గుతుంది.ఇంకా అలాగే ఆకుకూరలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. వీటిల్లో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.కూరగాయలలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పాలకూరలో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. దీన్ని సలాడ్లు ఇంకా అలాగే జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఆకుపచ్చని కూరగాయలను తినడం వల్ల శరీరానికి తగిన మోతాదులో పొటాషియం అంది హైబీపీ కూడా కంట్రోల్ లోకి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: