దానిమ్మ పండుతో బోలెడు లాభాలు..!!

Divya
ఆరోగ్యకరమైన పండ్లల్లో ఇది ఒకటి. దానిమ్మ పండు చాలా రుచిగా ఉంటుంది. గింజల సమృద్ధిగా ఉండే దానిమ్మలో మన శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచే యాంటీఆక్సిడెంట్లు,విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. అలానే ఇందులో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. దానిమ్మలో అనేక రోగాలపై పోరాడే విశేష గుణాలు ఉన్నాయి . ముఖ్యంగా ధీంట్లో క్యాన్సర్ తో పోరాడే లక్షణం ఉంది. రొమ్ము, ఊపిరితిత్తులు, క్యాన్సర్ల పై పోరాడే వ్యతిరేక లక్షణాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. దానిమ్మ పండు లోని పోషకాలు వాటి ప్రయోజనాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దానిమ్మ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లిపోయి మన శరీరం కాంతివంతంగా, నిగనిగలాడుతూ  ఉంటుంది.
దానిమ్మ పండులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దానిమ్మ పండు తినడం వలన మన జీర్ణ ప్రక్రియ చాలా బాగా మెరుగుపడుతుంది. అలానే మనం తీసుకున్న ఆహారం చాలా త్వరగా డైజెషన్ అయ్యేలా చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపుతుంది. దానిమ్మ పండు బరువు తగ్గడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దానిమ్మ పండులో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించే గుణాలు ఉన్నాయి.
దానిమ్మతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని అడ్డుపడకుండా దానిమ్మ పండు లోని పోషకాలు నివారిస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాలను పెంచుతుంది. దానిమ్మ రసం తాగడం వలన రక్తపోటు తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది.
దానిమ్మ పండుకు మూత్రపిండాల్లో  రాళ్లు ఏర్పడ్డాన్ని నివారించే శక్తి ఉంది. ముత్ర పిండాల్లో రాళ్లకు కారణమయ్యే ఆక్సలైడ్లు,క్యాల్షియం,ఫాస్పెట్ సాంద్రతను తగ్గించి రాళ్లు ఏర్పడటాన్ని నిరోధిస్తుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి రోజుకు ఒకసారైనా దానిమ్మ రసం తాగడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: