పుదీనా జ్యూస్ తరుచుగా తాగితే ఇన్ని ప్రయోజనాలా..!

Divya
ఇప్పుడున్న ఆహార అలవాట్లు, సీజన్ మార్పులు వల్ల ప్రతి ఇంట్లోను తీవ్ర అనారోగ్య సమస్యలకు గురి అవుతుంటారు. వాటన్నింటికి ఖర్చుతో కూడిన ఇంగ్లీష్ మందులు వాడకుండా ఉపశమనం పొందడానికి మన ఆయుర్వేదంలో ఎన్నో అద్భుతమైన మార్గాలున్నాయి. అలాంటి వాటిల్లో పుదీనా ముఖ్యమైనది. దీనిని ఎన్నో ఆయుర్వేదిక మందుల తయారీలో వాడుతుంటారు.పుదీనా వాసన చాలామంది ఇష్టపడుతారు.
 ఈ చలికాలం సీజన్ లో పుదీనా కషాయంను కొద్ది మంది మాత్రమే తాగుతూ ఉంటారు. కానీ పుదీనా యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే  ప్రతి ఒక్కరూ తమ డైట్ లో చేర్చుకోవాల్సిందే.

పుదీనా కషాయంను తీసుకోవడం వల్ల ప్రధానంగా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.అజీర్తి మరియు మలబద్దకం, గ్యాస్ ట్రబుల్‌ అసిడిటీ వంటి వాటికీ మంచి ఉపశమనం కలుగుతుంది. పుదీనా ఆకులు జలుబుతో బాధపడుతున్న వారు తక్షణ విరుగుడుగా పని చేస్తుంది.పుదీనా కషాయం ఉదయం, సాయంత్రం ఒక గ్లాస్ చొప్పున తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలను సులభంగా తగ్గించుకోవచ్చు.
ఆరోగ్య సమస్యల కారణంగా వాంతులు,వికారం తో బాధపడుతుంటే అలాంటి వారికి గుప్పెడు పుదీనా ఆకుల తీసుకొని మీక్సీ పట్టి, అ రసంలో తేనే కలుపుకొని ను తాగడం వల్ల వెంటనే ఆ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. కొంతమందికి జర్నీ సమయంలో వాంతులు మరియు వికారం అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారు పుదీనా ఆకులు తీసుకోనీ,ఆ సమయంలో ఒక్కో ఆకు నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటే వికారం తగ్గుతుంది.దంత సమస్యలు చాలామందిని వేదిస్తుంటాయి. ముఖ్యంగా చిగుళ్ల నుంచి రక్తం కారడం,పళ్ళు పుచ్చి పోవడం వంటి సమస్యలకు పుదీనా ఆకులు నమలడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.ఈ ఆకుల కషాయం తరుచుగా తీసుకుంటే మెదడు పని తీరు మెరుగుపడుతుంది.పుదీనా చర్మ సమస్యలు కూడా సులభంగా తగ్గిస్తుంది. మానసిక ఒత్తిడినీ కూడా తగ్గిస్తుంది. కావున ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ తమ రోజువారీ డైట్ లో పుదీనా ఆకులతో చేసే పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: