చలిగా ఉందని కాఫీ ఎక్కువగా తాగుతున్నారా..అయితే ఈ సమస్యలు తప్పవు..!!

Divya
మన దేశంలో ఉదయం లేచిన వెంటనే కాఫీ తాగందే వారి రోజు మొదలవదు.ఇది మైండ్ చురుకుగా పనిచేయడానికి, శరీర ఉత్తేజానికి ఎంతగానో సహాయపడుతుంది. కానీ కొంతమంది కాఫీ మాటిమాటికి తీసుకుంటూ వుంటారు.కాఫీని ఎక్కువగా తాగడం, సమయపాలన లేకుండా తాగడం మూలానా అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉదయాన్నే పరగడుపున కాఫీని తాగడం వల్ల, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి,నిద్రలేమి, డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు పరిశోదనలు చేసి మరీ నిరూపించారు. తరుచు కాఫీ తాగేవారికి కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
నిద్ర సమస్యలు
కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్ర రాకుండా చేస్తుంది.కావున దీన్ని నిద్రపోయే ముందు తీసుకుంటే, నిద్రలేమిని ఎదుర్కొనవలసి వస్తుంది. కొంతమంది పని వున్న సమయంలో నిద్రను నివారించడానికి తీసుకున్నా, నిద్రసమయానికి రెండు నుంచి మూడు గంటల ముందు మాత్రమే తీసుకోవాలి.
ఆందోళన
కాఫీ ఆడ్రినలిన్ అనే హార్మోన్ ని విడుదల అవడానికి దోహదపడుతుంది. దీని వల్ల ఆందోళన సమస్యకు గురి అవుతారు. ముఖ్యంగా కెఫిన్ సెన్నిటివిటీ ఉన్నవారికి  మైకము, నాడీ లేదా చేతులు వణుకుతున్నట్లు అనిపిస్తుంటుంది. అందువల్ల ఎక్కువ మొత్తంలో కాఫీని తాగకపోవడమే చాలా మంచిది.
జీర్ణ సమస్యలు
ఎక్కువగా కాఫీ తీసుకోవడం వల్ల,ప్రేగు పనితీరును దెబ్బ తీస్తుంది. దీని వల్ల గ్యాస్,అజీర్ణం, ఆకలి వేయకపోవడం,విరేచనాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.ఇది కలిగించే గ్యాస్ సమస్య క్రమంగా గుండె పని తీరును దెబ్బ తీసి, గుండె జబ్బులకు కారణం అవుతుంది.ఇలాంటి సమస్యలతో ఇబ్బందిపడుతుంటే మీరు కాఫీ తీసుకోవడం తగ్గించుకోవాలి.
డిపెండెన్సీ
కాఫీలో ఉండే కెఫిన్ అనే డ్రగ్ ఉంటుంది. దీనిని అధికంగా వినియోగించడం వల్ల, క్రమంగా మానసిక మరియు శారీరక సమస్యలకు దారితీస్తుంది. అలా అని కాఫీని అకస్మాత్తుగా మానేస్తే తలనొప్పి, చికాకు, బద్ధకం మరియు అలసట వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల కాఫీని వినియోగం తగ్గించుకుంటూ రావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: