పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు ఇవే?

Purushottham Vinay
చిన్న పిల్లలకు పండ్లను పిల్లలకు తినిపిస్తే మంచి పోషణతో పాటు సీజనల్ వ్యాధుల ప్రమాదం నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. ఇక ఏ సీజన్ లో లభించే పండ్లను ఆ సీజన్‌లోనే తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. సాధారణంగా చలికాలంలో రోగనిరోధక శక్తి అనేది బాగా తగ్గుతుంది. చిన్నపిల్లలూ తరచూ దగ్గు, జలుబు ఇంకా జ్వరాలతో బాధపడుతుంటారు. వారికి ఈ సమయంలో బలవర్థకమైన పోషకాహారం చాలా అవసరం. ఈ చలికాలంలో లభించే కొన్ని పండ్ల రకాలను తినడం వలన వారికి చాలా మంచి పోషణ అందడంతో పాటు ఇంకా అలాగే అనేక వ్యాధుల బారినపడే ప్రమాదం తగ్గుతుంది. జ్యూస్‌లకు బదులు నేరుగా ఫ్రూట్స్‌ను తినడం చాలా మంచిది.క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని పిల్లలకు తినిపిస్తే మంచిది.అలాగే ఈ క్యారెట్‌లో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. వీటిలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఇంకా అలాగే ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే పిల్లల కంటి చూపు కూడా ఖచ్చితంగా సరిగ్గా ఉంటుంది, కాబట్టి వారు క్యారెట్‌లను ఏదో ఒక రూపంలో తినిచాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఇంకా అలాగే చలికాలంలో పిల్లలకు అందించాల్సిన పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. వీటిలో విటమిన్ సి, ఇ , కె, యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్ ఇంకా అలాగే పొటాషియం ఐరన్ వంటివి ఉన్నాయి.

ఈ పోషకాలన్నీ కూడా పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.ఇంకా అలాగే బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. వైరస్‌ ఫ్లూల బారినుండి పోరాడటానికి కూడా బాగా సహాయపడతాయి.నల్ల ద్రాక్ష కూడా చాలా మంచిది. ఇది చలికాలంలో దొరుకుతుంది. వీటితో ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగిస్తాయి. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ద్రాక్షలోని పోషకాలు పిల్లల గుండె ఆరోగ్యానికి  కూడా చాలా ఎక్కువ మేలు చేస్తుంది.ఇంకా అలాగే నారింజలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. వీటిలో విటమిన్ సి తోపాటు పొటాషియం ఇంకా ఫోలేట్ కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే పిల్లలు నారింజలను తినడానికి ఎంతో ఇష్టపడతారు.ఇంకా అలాగే ఉసిరికాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. వెంట్రుకలు పెరుగుదల, చర్మం ఇంకా కళ్ల ఆరోగ్యానికి ఉసిరికాయలు మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది. తినే ఆహారం కూడా సులభంగా జీర్ణమయ్యేలా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: