ఈ అలవాట్లు ఉంటే భవిష్యత్తులో హార్ట్ స్ట్రోక్ రావచ్చు..!

Divya
ఇప్పుడున్న దైనంధన జీవితంలో ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, నిద్ర సరిగా లేకపోవడం వంటి అలవాట్ల వల్ల రాను రాను ఇది హార్ట్ స్ట్రోక్ కి దారి తీస్తుంది. అంతేకాక హార్ట్ స్ట్రోక్ కి కారణమయ్యే అలవాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
స్ట్రోక్ వల్ల ఒక్కొక్కసారి ప్రాణాపాయస్థితి వస్తుంది. దానిని నివారించడానికి దీర్ఘకాలిక రోగాలైన  అధిక బీపీ, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, స్థూలకాయం, గుండె జబ్బులు  రాకుండా జాగ్రత్తగా ఉండాలని,  వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  చిన్న వయసులోనే స్ట్రోక్‌ను నివారించడంలో జీవన విధానంలో మార్చుకునే మంచి అలవాట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మంచి ఆరోగ్యం అలవాట్ల వల్ల ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది . వాటిల్లో ముఖ్యమైనవి  లిక్కర్ కు దూరంగా ఉండటం, రోజు తప్పనిసరి  వ్యాయామం చేయడం, బీడీ,సిగరెట్లు తాగడం మానేయడం , అధిక  బరువు తగ్గడం, పని ఒత్తిడిని నియంత్రించడం వంటివి మరింత సహాయపడతాయి.
 కొన్ని మంచి ఆహారాలవాట్లు అలవాటు చేసుకోవడం వల్ల చిన్న వయసులో వచ్చే స్ట్రోక్ బారి నుంచి మనకు మనమే కాపాడుకోవచ్చు.
ముఖ్యంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ని ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. దీనికోసం చేపలు, వద్దు తిరుగుడు విత్తనాలు, 'విటమిన్ ఈ 'వంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి.
ధమనులలో కొవ్వు పేరుకు పోకుండా, కొలెస్ట్రాన్ ను  కరిగించే  విటమిన్ సి అధికంగా  ఉన్న ఆహారాలను తీసుకోవాలి.
దీర్ఘకాలిక రోగాలైన మధుమేహం, ఉబకాయం, బిపి వంటి వాటిని తగ్గించడానికి తృణధాన్యాలను, ఆకుకూరలను, వెన్న తీసిన పాలు, పెరుగును వాడడం ఎక్కువగా రోజువారి ఆహారం లో చేర్చుకోవాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి .అంతేకాక రోజు ఒక అరగంట సేపు వ్యాయామం, యోగ, వాకింగ్ వంటివి  చేస్తూ ఉండాలి. మనకు కొలెస్ట్రాల్ ఉన్న జంక్ ఫుడ్ మానివేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: