దానిమ్మ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందంటే?

Purushottham Vinay
దానిమ్మ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనితో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండుకి సీజన్ తో పనిలేదు. అన్ని సీజన్లో ఈ పండు బాగా పండుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పండు మీ ఇంట్లో ఉండేటట్లు చూసుకోండి.ఇక టైప్ – 2 డయాబెటిస్ నివారణ, చికిత్సకు దానిమ్మ అద్భుతంగా పని చేస్తుందని వివిధ అధ్యయనాలు వెల్లడించాయి. దానిమ్మలోని ఎల్లాజిక్, గాలిక్, ఒలియానోలిక్, ఉర్సోలిక్, ఆలిక్ యాసిడ్స్, టానిన్‌లు మధుమేహాన్ని నియంత్రించేందుకు చక్కగా పని చేస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. మధుమేహం ఉన్నవారిలో జరిపిన ఒక అధ్యయనంలో రోజూ దానిమ్మ రసం తీసుకోవడం వల్ల ఇన్‌ఫ్లమేటరీ మార్కర్‌లను 30 శాతం తగ్గించినట్లు తేలింది. భారతీయులు తమ ఆహార అలవాట్లలో పండ్లను అధికంగా వినియోగిస్తూ ఉంటారు. దానిమ్మపండ్లను సలాడ్ రూపంలో, జ్యూస్ ల రూపంలో తీసుకుంటారు. స్మూతీలు, స్నాక్స్ గా తీసుకుంటారు.ఈ పండులో ఎన్నో రకాల పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు అధిక సంఖ్యలో ఉంటాయి. ఇది శరీరాన్ని అన్ని రకాల అనారోగ్యాల నుంచి కాపాడుతుంది.


గుండె, మెదడు ఆరోగ్యానికి చక్కగా పని చేస్తుంది. విటమిన్ ఏ, విటమిన్ – సీ అధిక మొత్తంలో ఉంటుంది. ఆకలి కలిగించే భావనను పెంపొందించడం వల్ల బరువు పెరగకుండా చూసుకుంటుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు స్థాయిలు ఎంత వరకు ఉన్నాయంటే.. గ్రీన్ టీ లేదా రెడ్ వైన్ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా. అంతే కాకుండా ఇందులోని లిపోప్రొటీన్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దానిమ్మపండులో 83 కిలో కేలరీలు, 13 గ్రాముల చక్కెర ఉంటుంది, ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) 53 గా ఉంటుంది. ఇందులో ఫోలేట్, పొటాషియం, విటమిన్ కె పుష్కలంగా ఉుంటుంది. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటు (బీపీ)ని తగ్గించడంలో సహాయపడుతుంది.ఇన్ని ప్రయోజనాలు వున్న దానిమ్మ పండుని ఖచ్చితంగా తినండి. ఎల్లప్పుడూ కూడా ఎలాంటి రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: