హైబీపీని ఈజీగా తగ్గించే హోమ్ టిప్స్?

Purushottham Vinay
హైబీపీని ఈజీగా తగ్గించే హోమ్ టిప్స్ ?

హై బీపీ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ప్రస్తుత కాలంలో సహజంగానే చాలా మంది ఈ హైబీపీ సమస్యతో చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. ఇంకా రోజుకి ఎన్నో ఇలాంటి కేసులు నమోదు అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని విషయంలో మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.అయితే ఇందుకు అనేక రకాల కారణాలు ఉంటున్నాయి. అయితే కారణం ఏదైనప్పటికీ కూడా ఈ బీపీ సమస్య బారిన పడితే జీవితాంతం ఖచ్చితంగా మందులను వాడాల్సి ఉంటుంది.బీపీని ఖచ్చితంగా కూడా ఎప్పటికప్పుడు కంట్రోల్‌లో ఉంచుకోవాలి. లేదంటే గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక బీపీ సమస్యను నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం. అయితే ఈ చిట్కాలను పాటిస్తే బీపీ ఇట్టే కంట్రోల్ అవుతుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఉదయం లేవగానే గ్లాస్ లో గోరు వెచ్చని నీటిని తీసుకొని దాంట్లో సగం కోసిన నిమ్మకాయ రసాన్ని పిండుకొని తాగేయలి. అలా ప్రతి రోజూ పరగడుపునే తాగితే బీపీని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. మీకు పుచ్చకాయ విత్తనాలు తెలుసు కదా. వాటిని గసగసాలను తీసుకొని రెండింటినీ పొడిలా చేసుకొని ఉదయం ఓసారి రాత్రి ఓసారి రెండు పూటలు రోజూ ఓ చెంచాడు తింటే బీపీని బ్యాలెన్స్ చేసుకోవచ్చు.ఇక వెల్లుల్లి కూడా బీపీని కంట్రోల్ చేసేందుకు చక్కగా పనికొస్తుంది. అందుకు గాను ఓ రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని చేతితో చిదిమి అలాగే తినేయాలి. అవి ఘాటుగా ఉన్నాయని భావించేవారు కాస్త తేనెతో తీసుకోవచ్చు. ఇలా రోజూ తీసుకుంటే కచ్చితంగా బీపీని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. ఈ చిట్కాలను పాటించడం వల్ల బీపీ సులభంగా కంట్రోల్ అవుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: