రాత్రులు సరిగ్గా నిద్ర రావడం లేదా అయితే ఇలా చేయండి..!!

Divya
ప్రతి ఒక్కరు అందం, ఆరోగ్యంగా ఉండాలి అంటే కచ్చితంగా ప్రతి ఒక్కరికి నిద్ర అనేది చాలా అవసరం అయితే కానీ ప్రస్తుతం ఉన్న కొన్ని పరిస్థితుల కారణాలవల్ల నిద్ర పట్టకపోవడం అన్నది పెద్ద సమస్యగా మారుతోంది. ప్రతిరోజు కనీసం ప్రతి ఒక్కరూ ఏడు గంటల పాటు అయినా నిద్రపోవాలని ఇదే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అయితే నిద్రలేని సమస్యతో బాధపడుతున్న వారు పలు అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. ఇలాంటివారు నిద్ర పోయేదానికి ఇలాంటివి చేస్తే సరిపోతుంది. వాటి గురించి తెలుసుకుందాం.

1). కరివేపాకు  నూనెలో పలు రకాలు అయిన ఔషధ గుణాలు ఉండటం వల్ల ఈ నూనెతో తల స్నానం చేసినట్లు అయితే మానసిక ఒత్తిడి ఆందోళన నుంచి విముక్తి పొంది బాగా నిద్రపోతారు.
2). తలలో ఎవరికైనా దురద నొప్పి ఉన్నట్లు అయితే పెప్పర్ మెంట్ నూనెను తలకి పట్టించినట్లు అయితే ఈజీగా నిద్ర పట్టేలా చేస్తుంది.

3). గంధపు చెక్కలతో తయారు చేసిన ఆయిల్ మానసిక ఒత్తిడిని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది.
4). శరీరం యొక్క ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లు అయితే ఆముదంతో తయారుచేసిన నూనెను తలకు పట్టించినట్లు అయితే తల భారంతో పాటు శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గిపోతుంది. ఇక అంతే కాకుండా నిద్ర కూడా తొందరగా వస్తుంది.
5). సాంబ్రాణి తో తయారు చేసినటువంటి నూనెను తలకి పట్టించుకోవడం వల్ల చాలా తేలికగా నిద్ర పడుతుంది. ఇక ఎన్ని ఒత్తిడిలు ఉన్నప్పటికీ.. ఈ నూనె వాసన శ్వాసనాళాల వాయువు వల్ల నిద్ర తొందరగా వస్తుందట.

6). నిద్ర నిచ్చే గుణాలలో  సంపంగి నూనెలో చాలానే ఉంటాయి ఇందులో కొంత నూనెని మన తల స్నానం చేస్తున్నప్పుడు అందులోకి కలుపుకొని స్నానం చేయడం వల్ల ఆ సంపంగి నూనె వాసనకు ఆందోళనను దూరం చేసి మంచి నిద్రను ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: