ఈ కూరగాయలతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందేనా..!!

Divya
మాంసాహారాల కంటే కాయగూరలు ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివన్ని చెబుతూ ఉంటారు వైద్యులు. కూరగాయలలో ఎన్నో రకాలు పోషకాలు ఉంటాయి. అందుకే ప్రతిరోజు కావాల్సివన్ని కూరగాయలను మనం ఆహారంలో తీసుకుంటూ ఉంటాము.. కానీ కొన్ని కూరగాయలతో ఆరోగ్యానికి ఎంత మేలు కలుగుతుందో అంతే ప్రమాదం కూడా కలిగి ఉంటుంది అని నిపుణులు తెలియజేస్తున్నారు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

1). క్యారెట్:
ముఖ్యంగా క్యారెట్  కనిపించగానే వెంటనే చేతిలో పట్టుకొని తినేయడం మొదలు పెడుతూ ఉంటారు ఇందులో విటమిన్లు ప్రోటీన్లు చాలా అధిక మొత్తంలో ఉండడం వల్ల అది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.. అందుచేతన క్యారెక్టర్ ని వండకుండా తినడం కంటే పచ్చిగా తినాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అయితే వీటిని ఎక్కువ మొత్తానికి తినడం వల్ల కెరోటిన్ వల్ల చర్మం రంగు పసుపు రంగులోకి మారుతుంది.

2). కాలిఫ్లవర్:
కాలీఫ్లవర్ ఆరోగ్యకరమైన ఫుడ్.. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఈ కూరగాయలు తింటే కొంతమందికి గ్యాస్ ట్రబుల్ ఎసిడిటీ కడుపులో మంట వంటి సమస్యలు ఎదురవుతాయి.
3). పుట్టగొడుగులు:
పుట్టగొడుగులతో ఆరోగ్యానికి కలిగించే ప్రయోజనాలు చాలానే ఉంటాయని చెప్పవచ్చు. ఇందులో విటమిన్ ది పుష్కలంగా లభిస్తుంది.. అయినప్పటికీ ఇవి కొందరికి పడవని చెప్పవచ్చు ముఖ్యంగా అలర్జీ సమస్యలతో ఇబ్బంది పడేవారు వీటిని తినకపోవడం మంచిది.

4). బీట్ రూట్:
బీట్ రూట్ వెన్న పోషకాహారాలు ఉంటాయి బీట్ రూట్ ని జ్యూస్ గా కూడా తీసుకోవచ్చు. అలాగని ఈ బీట్ రూట్ ని ఎక్కువగా తినకూడదు.. అలా తింటే మీ చర్మం రంగు ఎరుపుగా లేదంటే గులాబీ రంగులోకి మారిపోతూ ఉంటుంది. ఇది అంత ప్రమాదం కానప్పటికీ మాత్రం వీటిని ఎక్కువ మోతాదులో తినకపోవడమే మంచిది. ఏది ఏమైనాప్పటికీ అతిగా తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: