ఈ సమస్య ఉంటే.. నెయ్యి అస్సలు ముట్టుకోవద్దట తెలుసా?

praveen
వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకుని నెయ్యి కలుపుకుని తింటే ఆ రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో మాటల్లో వర్ణించడం చాలా కష్టం అని చెప్పాలి. ఇక ఇలాంటి కాంబినేషన్ పేరు వినగానే ప్రతి ఒక్కరికి కూడా నోరూరిపోతు ఉంటుంది అని చెప్పాలి. అయితే పప్పు నెయ్యి కాంబినేషన్ కూడా ఎంతోమంది అమితంగా ఇష్టపడుతుంటారు.  సాధారణంగా మనందరికీ తెలిసిన నెయ్యిలో ఎంతో మందికి తెలియని ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా నెయ్యిని తినడానికి ఇష్టపడుతుంటారు. నెయ్యిలో ఎన్నో ఆరోగ్యకరమైన కొవ్వు ప్రొటీన్లు విటమిన్ ఏ విటమిన్ ఇ విటమిన్ కె పుష్కలంగా లభిస్తాయి.

కాగా నెయ్యి తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి. జీవక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా అటు గుండె కూడా ఎంతో ఫిట్గా ఉండేందుకు అవకాశం ఉంటుందట. అలాగే జుట్టు చర్మం కూడా ఆరోగ్యంగానే ఉంటాయట.  కొంతమంది మాత్రం నెయ్యికి దూరంగా ఉండడమే మంచిది అని చెబుతూ ఉంటారు. కడుపుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు నెయ్యి అసలు తినకూడదట. ఎందుకంటే గ్యాస్ట్రిక్ అసిడిటీ అజీర్తి వంటి సమస్యలు నెయ్యి తింటే  మరింత ఎక్కువవుతాయట. ఇక లివర్ ప్రాబ్లం తో బాధపడుతున్న వారు కూడా నెయ్యికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

 లివర్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వారు నెయ్యి తింటే సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుందట. నెయ్యితో మన శరీరం లో కొవ్వు పెరిగే అవకాశం ఉంది. అందుకే హార్ట్ పేషంట్స్ కూడా నెయ్యికి దూరంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. దగ్గు జలుబు లాంటి సమస్యలతో బాధపడేవారు కూడా నెయ్యికి దూరంగా ఉండటమే మంచిది అంటున్నారు నిపుణులు. ఇక మిగతా వారు నెయ్యి  పుష్కలంగా తినొచ్చు అంటూ వైద్యులు సూచిస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: