పసుపుతో ఈ వ్యాధులకు చెక్ పెట్టవచ్చా..?

Divya
పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలో పెరిగే బ్యాక్టీరియా, ఫంగస్ వంటి వాటిని పసుపు నాశనం చేస్తుంది. ప్రస్తుత వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా , వైరస్, ఫంగస్ అనే వైరస్లు చాలా వేగంగా పెరుగుతాయి. అందువల్ల ప్రత్యేకించి ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా పసుపు కూడా వినియోగించడం మంచిదని నిపుణులు తెలుపుతూ ఉంటారు. ఆహార పదార్థాలను, ద్రవ పదార్థాలలో పసుపుని ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా జలుబు, చర్మవ్యాధుల సమస్యలు ఉంటే పసుపు క్రమం తప్పకుండా ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

1). పసుపు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. అందువల్ల వీటిని పాలతో కలిపి తీసుకోవడం మంచిది. వర్షాకాలం ప్రారంభం నుంచి మొదలు పసుపు పాలను తాగడం వల్ల చాలా మంచిది.

2). వర్షాకాలంలో పాలు ఎక్కువగా తాగ కూడదని చెబుతూ ఉంటారు. కానీ ఈ శ్రావణమాసంలో పాలు తాగకూడదు అనే మాట వాస్తవమే కానీ వాస్తవానికి రుతుపవనాలు రెండు నెలల ముందుగానే ఉంటాయి అందుచేతనే ఈ మాసంలో పసుపు పాలను తీసుకోవడం చాలా మంచిది.

3). రాత్రి సమయాలలో భోజనం చేసిన తర్వాత ఒక గంట తర్వాత ఒక గ్లాసు పాలలో ఒక టీ స్పూన్ పసుపును వేసుకొని తాగడం చాలా మంచిది. ఈ పాలల్లోకి చక్కెర లేదా బెల్లం ఉపయోగించుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. పసుపు పాలను ఉదయం పూట మాత్రమే తీసుకోవాలి. భోజనం చేసిన గంట తర్వాత మాత్రమే పాలను తీసుకోవాలట.

4). జలుబు సమస్యతో సతమతమవుతున్న ఎవరైనా సరే ఈ పసుపు పాలను తాగడం వల్ల వాటి నుంచి విముక్తి పొందవచ్చు. ఈ వర్షాకాలంలో పసుపు పాలను తరచూ తాగుతూ ఉండడం వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: