పినాకిల్ బ్లూమ్స్ : ఆటిజంపై.. అలుపెరగని పోరాటం..!

Chandrasekhar Reddy
అనుభవించే వారికే ఆ బాధ తెలుస్తుంది, వారి మానసిక సంఘర్షణ నుండి ఎన్నో అద్భుతాలైన పరిష్కారాలు వెలుగులోకి వస్తాయి. అలా తాము అనుభవించిన బాధ నుండి పరిష్కారం వెతికి పట్టుకున్నారు. అలా ఏర్పడిందే సరిపల్లి కోటిరెడ్డి మరియు వాటి సతీమణి శ్రీజారెడ్డి లు ఏర్పాటు చేసిన పినాకిల్ బ్లూమ్స్ సంస్థ. పిల్లలు ఇటీవల మానసిక ఎదుగుదల లేని స్థితిలో జన్మిస్తున్నారు.  అటువంటి పిల్లలను చూసి తల్లిదండ్రులు మొదటిలో ఏడుస్తూ ఉండిపోతున్నప్పటికీ, తమ బిడ్డపై ఉన్న ప్రేమానురాగాలతో అతడిని ప్రస్తుత సమాజానికి తగ్గట్టుగా తన కాళ్లపై తాను బ్రతికే విధంగా తయారుచేయాలని సంకల్పిస్తున్నారు. అలా సంకల్పించడంతో పినాకిల్ మొదలైంది. అప్పటి నుండి ఎందరో ఆటిజం పిలల్లకు సేవలు అందిస్తూనే ఉంది. ఈ తరహా సమస్యతో బాధపడుతున్న వారు చిన్న వయసు నుండి కూడా తమ పనులు తాము చేసుకోలేని స్థితిలో ఉంటారు. వారికీ సరైన వైద్య సేవలు అందిస్తూ, కాసింత ఎక్కువ శ్రద్ద వారిపై చూపించడం ద్వారా వారికీ సాధారణ జీవితాన్ని అందించవచ్చు.
అలాంటి ప్రయత్నమే చేస్తూ విజయపధంలో ముందుకు పోతుంది పినాకిల్ సంస్థ. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అనే ప్రశ్న తలెత్తితే, దానికి సమాధానంగా ఈ వివరాలు తెలుసుకుందా. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సమస్య ఉంది. 1995 నుండి పరికిస్తే అప్పటికి ప్రపంచ వ్యాప్తంగా 500 చిన్నారులలో ఈ సమస్య గుర్తించారు. ప్రస్తుత పరిస్థితులలో అనేక అలవాట్ల మార్పిడి ఆహారం తీసుకునే విషయంలో అనేక మార్పులు కారణంగా ఈ సమస్య కూడా పెరుగుతూనే వచ్చింది. 2019నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఇంకా పెరుగుతూనే వచ్చింది. ఇది పైకి కనిపించే సమస్య కాకపోవడంతో అందరూ తల్లిదండ్రులు దీనిని గుర్తిచడంలో ఆలస్యం చేస్తూనే ఉన్నారు. దానితో సమస్య పెరిగిపోతుంది. ఈ సమస్యపై చదువుకున్న వారిలో కూడా అంత పరిజ్ఞానం లేకపోవడం కూడా దానిని గుర్తించడం కష్టతరం అవుతుంది. ఈ సమస్య గురించి అవగాహనా కార్యక్రమాలు కూడా పెద్దగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరగకపోవడం వలన దీనిపై ఎవరికి సరైన అవగాహనా ఉండటం లేదు. దాదాపు దానిని గుర్తించిన వారికి తప్ప మరొకరికి ఈ విషయం పై అవగాహన లేకపోవడం సమస్యను పెద్దది చేస్తుంది.
ఈ సమస్య ఉన్న పిలల్లలో కనీసం తల్లిదండ్రులను గుర్తించే పరిస్థితి ఉండదు. కొందరిలో వినికిడి సమస్య ఉండవచ్చు, మరి కొందరు ఊరికే అలా ఉన్నచోట ఉంటారు తప్ప ఇతర పిల్లల మాదిరి ఆడుకోవడం, అల్లరి చేయడం లాంటివి చేయరు. చిన్న వయసులోనే పిల్లల కు స్పందించడం అలవాటు చేసుకున్న తల్లిదండ్రులకు మాత్రమే ఇవన్నీ తెలుస్తాయి. అలా తెలిసిన వారు కూడా ధైర్యంగా వైద్యం పొందటానికి ముందుకు రావాలి. తమ పిల్లవాడిని తోటివాళ్ళు అల్లరి చేస్తారేమో అని వాళ్ళు సమస్యను దాచిపెడితే భవిష్యత్తులో వాళ్ళు చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే గుర్తించిన వెంటనే తగిన వైద్యుల తో పరీక్ష చేయించడం ద్వారా సమస్యను గుర్తించవచ్చు. వీరికి సాధారణ జీవితం జీవించడానికి పూర్తి హక్కులు ఉన్నాయి, వాటిని సమకూర్చే శ్రద్ద, సహజం ఆయా తల్లిదండ్రులలో ఉండాల్సి ఉంటుంది. అలా తమ సమస్యపై అనుక్షణం పోరాడారు కాబట్టే సంస్థ స్థాపకులు కూడా తమ సమస్యకు పరిష్కారం కనుక్కోవడమే కాకుండా పలువురికి అలాంటి సేవలు అందించడంలో విజయం సాధిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ 14 శాఖలుగా విస్తరించి అనేకమంది అటిజం పిల్లలకు సేవలను అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: