తస్మాత్ జాగ్రత్త :ఆకుకూరలు, కూరగాయలు వీటిలో ఏవి ఎలా తినాలోతెలుసా..?

Divya

మారుతున్న జీవన శైలిలో, అత్యాధునిక సమాజంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త రుచిని ఆస్వాదించాలనే కోరికతో మనసు తహతహలాడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏవి? ఎప్పుడు? ఎలా తినాలో?చాలా మందికి తెలియదు.. అంతేకాకుండా డైటింగుల పేరిట కొన్ని కాయగూరలను పచ్చిగా తింటే, మరికొన్ని కాయగూరలను రుచికోసం వండి తింటున్నారు. అయితే కొన్ని వండకుండానే తినాలి.. మరి కొన్ని ఉడికించి మరీ తినాలి.. అయితే ఏవి ఎలా తినాలో ? ఒకవేళ వాటిలో మార్పులు చేస్తే ఏం జరుగుతుందో ..?ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
ఉడికించకుండా తినాల్సినవి :
సాధారణంగా ఉడికించకుండా అలాగే పచ్చిగా తినే కొన్ని పదార్థాలు ఉన్నాయి. అందులో తాజా పండ్లను మినహాయిస్తే, మనలో చాలామంది క్యాబేజీ, క్యారెట్, మొలకెత్తిన  గింజలు, కీరా దోసకాయ, టమోటా వంటివి సలాడ్ లాగా చేసుకుని,డైటింగ్ పేరుతో తింటుంటారు. అయితే ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం కూడా ఒకటుంది..  అది ఏమిటంటే ప్రస్తుతం పండించే ఏ పంట అయినా పురుగుల ప్రభావం కారణంగా,రైతులు మందులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.  కాబట్టి ఇలాంటి కాయగూరలు పైన మందుల ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకే క్యాబేజీని వీలైనంత వరకు ఆవిరి మీద ఉడికించి తీసుకోవడం మంచిది.
అలాగే మొలకెత్తిన గింజలతో చాలామంది కట్లెట్ లు, కర్రీ లు చేసుకొని తింటుంటారు. ఇలా చేయడం వల్ల వీటిలో ఉండే పోషకాలు నశించిపోవడమే కాకుండా మొలకలు వేడికి గురి అయితే, అవి విషపూరితంగా మారి అనారోగ్యాన్ని కలిగించే అవకాశం కూడా చాలా ఉంది. ఇక కీరదోస,టమోటా, క్యారెట్ లాంటివి నేరుగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఉన్న పోషకాలు ఇంకా సమర్థవంతంగా అందుతాయి. అయితే మనలో చాలామంది వీటిని తినేటప్పుడు రుచి కోసం కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, కారం దట్టించి తింటూ ఉంటారు.  ఇలా తినడం ఒకదానితో మరొకటి వ్యతిరేక ప్రభావాన్ని చూపే అవకాశాలు ఎక్కువ. ఇక పుదీనా కొత్తిమీర వంటివి జ్యూస్ చేసుకొని తాగడం వల్ల మహిళల్లో వచ్చే  నెలసరి సమయాలలో కలిగే ఇబ్బందుల నుంచి దూరంగా ఉండవచ్చు.
ఉడికించి తినాల్సినవి :
దుంపల్లో కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ సమృద్ధిగా మనకు అందాలంటే మాత్రం తప్పకుండా ఉడికించి తినాలి. ఇంకా చాలామంది మాంసాన్ని పిజ్జా,శాండ్విచ్ పేరిట పచ్చి మాంసాన్ని తింటూ ఉంటారు.  అలాగే కొంతమంది కాల్చుకొని తింటున్నారు. ఇలా తినడం వల్ల సగభాగం సరిగ్గా ఉడక్క,జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఏ పదార్థాలు అయితే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయో అవి ఫ్యాట్ గా మారి,బరువు పెరగడాన్ని ప్రోత్సహిస్తాయి. కాబట్టి అవే కాకుండా అనేక రకాల కాయగూరలను ఉడికించి తినడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: